గత రెండు మూడు రోజుల నుంచి 'రియా ఎక్కడ?' అని తెగ వైరల్ చేస్తున్నారు.
ఇది 'మత్తు వదలరా 2' సినిమాలోని సత్య-అజయ్ మాట్లాడుకునే ఓ సీన్‌లోని డైలాగ్.
థియేటర్లలో వచ్చినప్పుడు మూవీ గురించి మాట్లాడుకున్నారు. ఓటీటీలోకి వచ్చాక రియానే హాట్ టాపిక్.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎందుకు ట్రెండ్ అవుతుందో చెప్పలేం కదా?
అలానే గత రెండు మూడు రోజులుగా మూవీలోని రియా సీన్ ట్రెండ్ అవుతోంది.
రియా పాత్ర చేసిన అమ్మాయి అసలు పేరు ఐషూ యాదవ్. ఈమెది ముంబై.
పేరుకే నార్త్ కానీ తెలుగులో ఇప్పటికే 'సిద్దూ బీకాం' షార్ట్ ఫిల్మ్‌లో నటించింది.
ఇన్ స్టాలోనూ ఈమెకు దాదాపు 8 లక్షలకు పైనే ఫాలోవర్స్ ఉన్నారు.
'మత్తు వదలరా 2'కి పనిచేసిన అసిస్టెంట్ దర్శకుడి వల్ల ఈమెకు సినిమాలో ఛాన్స్ వచ్చింది.
చేసింది చిన్న పాత్రనే అయినా రియా అనే పేరు దెబ్బకు వైరల్ అయిపోయింది.
మరి ఈ ట్రెండింగ్, వైరల్ కావడం ఈమెకు ఏమైనా కొత్త అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి?


