breaking news
AUM
-
పదేళ్లలో రూ.300 లక్షల కోట్లు!
రిటైల్ ఇన్వెస్టర్ల అండతో దేశంలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మరింత విస్తరించనుంది. ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) వచ్చే పదేళ్ల కాలంలో గణనీయంగా పెరగునున్నట్టు గ్రో, బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక అంచనా వేసింది. 2025 అక్టోబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఏయూఎం రూ.79.88 లక్షల కోట్లుగా ఉంటే, 2035 నాటికి రూ.300 లక్షల కోట్లకు చేరుకోనున్నట్టు తెలిపింది. ఇందులో డైరెక్ట్ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ రూ.250 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది.డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ, పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో 10 శాతం గృహాలే మదుపు చేస్తుండగా, వచ్చే దశాబ్ద కాలంలో 20 శాతానికి విస్తరించనున్నట్టు అంచనా వేసింది. స్పెక్యులేటివ్ ట్రేడింగ్ నుంచి దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడం, డిజిటల్ సాధనాల వ్యాప్తి, బలమైన మార్కెట్ పనితీరు ఇందుకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. డెరివేటివ్స్ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కట్టడికి సెబీ ఇటీవలి కాలంలో తీసుకున్న కఠిన చర్యలను ప్రస్తావించింది. ఇవి సైతం ఫండ్స్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు పేర్కొంది. కొత్తగా 9 కోట్ల మంది రిటైల్ ఇన్వెస్టర్లు జెన్ జెడ్, మిలీనియల్స్ నుంచి వస్తారంటూ.. ఇందుకు పెరుగుతున్న డిజిటల్ వినియోగం, పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యతను ప్రస్తావించింది.దీర్ఘకాల దృక్పథం..ఇన్వెస్టర్లలో దీర్ఘకాల పెట్టుబడుల ధోరణి బలపడుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఐదేళ్లకు పైగా ఫండ్స్‌లో కొనసాగిస్తున్న పెట్టుబడులు 7 శాతం నుంచి 16 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. అంతేకాదు ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులు సైతం 12 శాతం నుంచి 21 శాతానికి పెరిగినట్టు నిదర్శనాలుగా పేర్కొంది. గత ఐదేళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోలు (ఒక పథకంలో పెట్టుబడికి కేటాయించే సంఖ్య) రెండున్నర రెట్లు పెరిగా యని వెల్లడించింది. ఫోలియోలు గణనీయంగా పెరిగినప్పటికీ పెట్టుబడుల రాక కేవలం 7 శాతమే పెరగడం వెనుక, కొత్త ఇన్వెస్టర్లు తక్కువ మొత్తం పెట్టుబడులతో వస్తుండడాన్ని కారణంగా ప్రస్తావించింది. ‘‘సిప్ పెట్టుబడులు ఏటా 25 శాతం చొప్పున గత దశాబ్ద కాలంలో పెరుగుతూ వచ్చాయి. 30 ఏళ్లలోపు వయసున్న ఇన్వెస్టర్లు ఇప్పుడు 40 శాతానికి చేరారు. 2018–19 నాటికి 23 శాతంగానే ఉన్నారు’’అని ఈ నివేదిక వివరించింది. భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రయాణంలో రిటైల్ పెట్టుబడులు ప్రధాన చోదకం కానున్నాయని, ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ వ్యాప్తంగా 7 లక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. ఫండ్స్-ఈక్విటీలకు ప్రాధాన్యం..సంప్రదాయ పొదుపు సాధనాల నుంచి పెట్టుబడుల ఆధారిత సాధనాల వైపు ఇన్వెస్టర్లు క్రమంగా మళ్లుతున్నారని బెయిన్ పార్ట్నర్ సౌరభ్ ట్రెహాన్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల్లో ప్రత్యక్ష పెట్టుబడులు ఇటీవలి కాలంలో వేగవమంతైన వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ‘‘భారతీయులు ‘తొలుత పొదుపు నుంచి ముందుగా పెట్టుబడి పెట్టు’ మనస్తత్వానికి మారుతున్నట్టు గుర్తించామని గ్రో సహ వ్యవస్థాపకుడు హర్ష జైన్ తెలిపారు. -
అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం చూపిస్తుండడంతో అక్టోబర్ చివరికి నాటికి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) రూ.2.5 లక్షల కోట్లకు చేరాయి. ఏడాది కాలంలో ఏయూఎం విలువ 13 శాతం పెరిగింది. 2024 అక్టోబర్ చివరికి వీటి విలువ రూ.2.21 లక్షల కోట్లుగా ఉంది. ఈక్విటీ సూచీలు ఏడాదికి పైగా దీర్ఘకాలం పాటు దిద్దుబాటును చవిచూసిన కాలంలో అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఆస్తులు పెరగడం అన్నది.. ఇన్వెస్టర్లు ఈక్విటీ, హైబ్రిడ్‌తో కలయిక ద్వారా పెట్టుబడుల వృద్ధితోపాటు స్థిరత్వానికి ప్రాధాన్యం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని ఫోలియోలు ఏడాది కాలంలో 4 లక్షలు పెరిగి అక్టోబర్ చివరికి 60.44 లక్షలకు చేరాయి. 2024 అక్టోబర్ చివరికి ఇవి 56.41 లక్షలుగా ఉన్నాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే సంఖ్యను ఫోలియోగా చెబుతారు. ఇలా ఒకే ఇన్వెస్టర్‌కు ఒకటికి మించిన పథకాల్లో ఫోలియోలు ఉండొచ్చు. మెరుగైన రాబడులు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ బలమైన రాబడులు ఇస్తుండడం కూడా ఇన్వెస్టర్లు వీటిల్లో మరింత పెట్టుబడులకు ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విభాగం గత ఏడాది కాలంలో 7 శాతం చొప్పున సగటు రాబడినివ్వగా, రెండేళ్లలో 16.5 శాతం (వార్షిక) చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టాయి. ఐదేళ్ల కాలంలోనూ 17 శాతం రాబడినిచ్చాయి. రెండు, ఐదేళ్ల కాలాల్లో నిఫ్టీ 50 హైబ్రిడ్ కాంపోజిట్ డెట్ 65:35 ఇండెక్స్‌ను అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ పనితీరు పరంగా అధిగమించినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఈ విభాగంలో పనితీరు పరంగా ముందుంది. రెండేళ్లలో ఏటా 19.6 శాతం చొప్పున కాంపౌండెడ్ రాబడిని ఇచ్చింది. ఐదేళ్లో అయితే ఏటా 24.7 శాతం రాబడి తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మహీంద్రా మాన్యులైఫ్ అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ రెండేళ్ల కాలంలో ఏటా 19.3 శాతం, ఐదేళ్లలో ఏటా 20.4 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడిని అందించింది. బంధన్, ఎడెల్వీజ్, ఇన్వెస్కో ఇండియా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ సైతం రెండేళ్ల కాలంలో ఏటా 18–19% మధ్య, ఐదేళ్లలో ఏటా 16.5–19.9% మధ్య ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్, మహీంద్రా మాన్యులైఫ్ అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ ఇక మీదటా దీర్ఘకాలంలో మెరుగైన పనితీరు చూపించగలవని విశ్లేషకుల అంచనా.భవిష్యత్తులో మరింత డిమాండ్.. ‘‘ఈక్విటీ–డెట్ కలయికతో ఉంటాయి కనుక రెండు విభాగాల నుంచి ఈ ఫండ్స్ ప్రయోజనం పొందుతాయి. బలమైన విభాగంగా బ్యాలన్స్డ్ ఫండ్స్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈక్విటీ విభాగంలో హెచ్చుతగ్గులు ఉన్న కాలంలో డెట్ పెట్టుబడులు రాబడులకు రక్షణ కల్పిస్తాయి. ఈక్విటీ పెట్టుబడులు వృద్ధిని చూస్తున్న తరుణంలో మంచి రాబడులను సొంతం చేసుకుంటాయి. మధ్యస్థ లేదా తక్కువ రిస్క్ తో కూడిన ఇన్వెస్టర్లకు ఇవి ఎంతో అనుకూలం’’అని మావెనార్క్ వెల్త్ సీఈవో శంతను అవస్థి తెలిపారు. సెబీ నిబంధనల ప్రకారం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో 65–80 శాతం మధ్య ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. -
ఈక్విటీ ఫండ్స్‌కు తగ్గుతున్న ఆకర్షణ!
ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు ఫండ్స్‌లో తాజా పెట్టుబడులపై ప్రభావం చూపిస్తున్నాయి. అక్టోబర్‌లోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 19 శాతం తక్కువగా రూ.24,691 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. సెప్టెంబర్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.30,422 కోట్లుగా ఉండడం గమనార్హం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది. బంగారం ధరల ర్యాలీ మద్దతుతో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి మరిన్ని పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో రూ.7,743 కోట్ల తాజా పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. నెలవారీ గరిష్ట రికార్డు ఇది. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ మొదటిసారి రూ.లక్ష కోట్ల మార్క్‌ను అధిగమించింది. సిప్ పెట్టుబడులు స్థిరం..దీర్ఘకాల లక్ష్యాల కోసం క్రమానుగత పెట్టుబుడుల (సిప్) విషయంలో ఇన్వెస్టర్ల ధోరణి స్థిరంగానే కొనసాగుతోంది. ఇందుకు నిదర్శనంగా సిప్ ద్వారా అక్టోబర్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచి్చన పెట్టుబడులు రూ.29,529 కోట్లుగా ఉన్నాయి. సెపె్టంబర్లో సిప్ పెట్టుబడులు రూ.29,631 కోట్లతో పోల్చితే స్వల్ప తగ్గుదల కనిపించింది. విభాగాల వారీగా..అక్టోబర్‌లో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మినహా మిగిలిన విభాగాల పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. అత్యధికంగా ఫ్లెక్సీకాŠయ్ప్ ఫండ్స్‌లోకి రూ.8,928 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెపె్టంబర్లో వచి్చన రూ.7,029 కోట్లతో పోల్చి చూస్తే 27 శాతం పెరిగాయి. మిడ్‌క్యాప్ ఫండ్స్ సెపె్టంబర్ నెల కంటే 25 శాతం తక్కువగా రూ.3,807 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ 20 శాతం తక్కువగా రూ.3,476 కోట్లు చొప్పున ఆకర్షించాయి.లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,177 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,500 కోట్లు, లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.972 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్‌లోకి రూ.939 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ రూ.1,366 కోట్లు ఆకర్షించాయి.ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నుంచి రూ.665 కోట్లు, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ నుంచి రూ.179 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.1.59 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు రెండు నెలల్లోనూ ఇవి నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్ రూ.89,375 కోట్లు, ఓవర్‌నైట్ ఫండ్స్ రూ.24,050 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.15,066 కోట్లు చొప్పున రాబట్టాయి. హైబ్రిడ్ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్ కలయిక) 14,156 కోట్ల పెట్టబుడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో పెట్టుబడులు రూ.9,397 కోట్ల కంటే 51 శాతం పెరిగాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి రూ.6,919 కోట్లు, మల్టీ అసెట్ ఫండ్స్‌లోకి రూ.5,344 కోట్లు చొప్పున పెట్టుబడులు వచ్చాయి. బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్/అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లోకి రూ.1,139 కోట్లు వచ్చాయి. ప్యాసివ్ ఫండ్స్ అయిన ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 13 శాతం తగ్గి రూ.16,668 కోట్లకు పరిమితమయ్యాయి.అక్టోబర్‌లో 18 కొత్త పథకాలు (న్యూఫండ్ ఆఫర్/ఎన్ఎఫ్వో) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.6,062 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి. అక్టోబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) సెప్టెంబర్ నుంచి 5 శాతం పెరిగి రూ.79.88 లక్షల కోట్లకు పెరిగింది. లాభాల స్వీకరణ వల్లే..ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం ఫలితంగా ఈక్విటీల్లోకి పెట్టుబడులు తగ్గినట్టు యాంఫి సీఈవో వీఎన్ చలసాని తెలిపారు. ‘‘సిప్ ఏయూఎం రూ.16.25 లక్షల కోట్లకు చేరింది. పరిశ్రమ మొత్తం ఏయూఎంలో సిప్ వాటా ఐదంట ఒక వంతుకు చేరింది. మొత్తం యాక్టివ్ సిప్ ఖాతాలు 9.45 కోట్లకు పెరిగాయి’’అని చలసాని తెలిపారు.ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు! -
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఫండ్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు మంచి డిమాండ్ నెలకొంది. ఈ విభాగంలో సుమారు 22 మ్యూచువల్ ఫండ్స్ పథకాలు సేవలు అందిస్తున్నాయి. వీటి నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏడాది కాలంలో 37 శాతం వృద్ధితో రూ.48,000 కోట్లకు చేరుకున్నాయి. 2024 మే చివరికి వీటి నిర్వహణ ఆస్తులు రూ.34,971 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ విభాగంలోని పథకాలు మంచి పనితీరు చూపించడం ఏయూఎంలో బలమైన వృద్ధికి కారమైనట్టు తెలుస్తోంది. ఈ పథకాలు గత ఏడాది కాలంలో పెట్టుబడులపై 22 శాతం నుంచి 30 శాతం వరకు రాబడులను అందించడం గమనార్హం. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న దీర్ఘకాల విశ్వాసానికి నిదర్శనంగా దీన్ని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీఎస్ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 14 శాతం పెరగ్గా.. ఇదే కాలంలో ప్రధాన సూచీ సెన్సెక్స్ పెరుగుదల 10 శాతంగానే ఉంది. అలాగే బీఎఫ్ఎస్ఐ రంగంలో బీమా, ఫిన్‌టెక్, వెల్త్ మేనేజ్మెంట్, డిజిటల్‌గా రుణాలు అందించే అన్‌లిస్టెడ్ కంపెనీల్లోనూ ఈ తరహా ఫండ్స్ పెట్టుబడులు పెడుతుండడం ఇన్వెస్టర్లు ఆకర్షిస్తోంది. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితంగా మారుతుండడం, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం విస్తరిస్తుండడంతో ఈ విభాగంలో బలమైన కంపెనీల సంఖ్య పెరుగుతోంది. దీంతో దీర్ఘకాలంలో మంచి పెట్టుబడుల అవకాశాలను ఈ రంగం ఆఫర్ చేస్తోంది’’అని వెల్త్ మేనేజర్ అల్ఫాషా పేర్కొన్నారు. -
ఇండెల్ మనీ నిర్వహణ ఆస్తుల పెంపు
బంగారం తనఖాపై రుణాలు అందించే ఇండెల్ మనీ తన నిర్వహణ ఆస్తులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి (2026 మార్చి) రూ.4,000 కోట్లను పెంచుకోనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణ ఆస్తులు (రుణాలు) రూ.2,400 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల రుణాల మంజూరును సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!గత ఆర్థిక సంవత్సరంలో 89 కొత్త శాఖలు తెరవడంతో మొత్తం 12 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శాఖల సంఖ్య 2025 మార్చి 31 నాటికి 365కు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.61 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఎన్పీఏలు గత ఆర్థిక సంవత్సరం చివరికి 1.35 శాతానికి తగ్గాయి. అంతకుముందు సంవత్సరం చివరికి ఇవి 3.17 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘రానున్న రోజుల్లో దేశీ వినియోగం మరింత పుంజుకుంటుంది. దీంతో బంగారం రుణాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం ఇందుకు అనుకూలిస్తుంది’’అని ఇండెల్ మనీ సీఈవో ఉమేష్ మోహనన్ తెలిపారు. -
పసిడిపై పైచేయి.. సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్
కోల్‌కతా: ఇటీవల కొంతకాలంగా వెండి ఈటీఎఫ్‌లు పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఏడాది కాలంలో సిల్వర్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) విలువ నాలుగు రెట్లు ఎగసింది. వెరసి గత నెల(అక్టోబర్)కల్లా వెండి ఈటీఎఫ్‌ల ఏయూఎం రూ. 12,331 కోట్లను తాకింది.2023 అక్టోబర్‌లో ఈ విలువ కేవలం రూ. 2,845 కోట్లుగా నమోదైంది. ఇన్వెస్టర్లు సిల్వర్‌ను దేశీయంగా ధరల పెరుగుదలతోపాటు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులకు హెడ్జింగ్‌గా భావించడం ఇందుకు జతకలిసినట్లు రేటింగ్ సంస్థ ఇక్రా అనలిటిక్స్ పేర్కొంది. ఈ వివరాల ప్రకారం..2022లో షురూ సిల్వర్ ఈటీఎఫ్‌లకు 2022లో తెరతీశారు. వీటి అందుబాటు, పారదర్శకతల కారణంగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి వీటికి డిమాండ్ పెరగుతోంది. దీంతో సిల్వర్ ఈటీఎఫ్ ఫోలియోల సంఖ్య 215 శాతం జంప్‌చేసి 4.47 లక్షలకు చేరింది. 2023 అక్టోబర్‌లో ఇది 1.42 లక్షలు మాత్రమే. ఈ కాలంలో నికర పెట్టుబడులు 24 శాతం ఎగశాయి. రూ. 643 కోట్లను తాకాయి.మరోపక్క మార్కెట్లో 2023 ఏప్రిల్‌లో 8 వెండి ఈటీఎఫ్‌లు నమోదుకాగా.. 2024 ఆగస్ట్‌కల్లా 12కు పెరిగినట్లు ఇక్రా అనలిటిక్స్ మార్కెట్ డేటా హెడ్, సీనియర్ వీపీ అశ్వినీ కుమార్ వెల్లడించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతుండటంతో సిల్వర్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ కొనసాగనున్నట్లు కుమార్ అంచనా వేశారు. సులభ నిర్వహణ సులభంగా స్టోర్ చేయగలగడం, తగినంత లిక్విడిటీ, చౌక వ్యయాలు వంటి అంశాలు సిల్వర్ ఈటీఎఫ్‌లకు ఆకర్షణను పెంచుతున్నాయి. ఫిజికల్ కొనుగోళ్లకు జీఎస్టీ వర్తించే సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్ట్‌కావడంతో పెట్టుబడులకు లిక్విడిటీ సైతం ఉంటుంది. యూనిట్ల రూపంలో సులభంగా లావాదేవీలు చేపట్టవచ్చునని కుమార్ తెలియజేశారు.అంతేకాకుండా వీటిలో పెట్టుబడులు ఉత్తమ రిటర్నులను సైతం అందిస్తున్నాయి. నెల రోజుల్లో 7.6 శాతం, 3 నెలల్లో 16 శాతం, 6 నెలలు పరిగణిస్తే 20.25 శాతం సగటున రాబడినిచ్చాయి. ఏడాది కాలాన్ని తీసుకుంటే 32.5 శాతం రిటర్నులు అందించాయి. ఇదే కాలంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల రాబడులతో పోలిస్తే ఇవి అధికంకావడం గమనార్హం! -
రూ. 5,000 కోట్ల ఏయూఎం లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండు–మూడేళ్లలో రూ. 5,000 కోట్ల ఏయూఎం (నిర్వహణలోని అసెట్స్) సాధించాలని నిర్దేశించుకున్నట్లు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ఇన్‌క్రెడ్‌మనీ సీఈవో విజయ్ కుప్పా తెలిపారు. ప్రస్తుతం ఇది రూ. 1,250 కోట్ల స్థాయిలో ఉందని, సుమారు రెండు లక్షల మంది యూజర్లు ఉన్నారని వివరించారు. వచ్చే రెండేళ్లలో బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తున్నామని, ఇప్పటికే లైసెన్స్ కూడా పొందామని ఆయన తెలిపారు. దేశీయంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పాన్కార్డ్హోల్డర్ల సంఖ్య 6–7 కోట్ల స్థాయిలో ఉండగా వచ్చే పదేళ్లలో ఇది 20 కోట్లకు చేరే అవకాశం ఉందని విజయ్ చెప్పారు. ప్రజలు క్రమంగా పొదుపు నుంచి ఇతర ఆర్థిక సాధనాల వైపు మళ్లుతుండటం ఇందుకు దోహదపడగలదని ఆయన వివరించారు. తమ ప్లాట్‌ఫాంలో రూ. 5 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వారి కోసం 24 ప్రోడక్ట్‌లు అందుబాటులో ఉన్నాయని విజయ్ చెప్పారు. బాండ్లు, ఈక్విటీల్లో పెట్టుబడుల మేళవింపుతో ఒకవైపు పెట్టుబడి భద్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ మరోవైపు అధిక రాబడులను కూడా అందించే విధంగా ఈ ప్రోడక్టులు ఉంటాయని ఆయన తెలిపారు. -
రెట్టింపు ఏయూఎంపై పిరమల్ ఎంటర్ప్రైజెస్ దృష్టి
ముంబై: ఇన్వెస్టర్ డే సందర్భంగా పిరమల్ ఎంటర్ప్రైజెస్ (పీఈఎల్) తమ దీర్ఘకాలిక వృద్ధి, లాభదాయకత ప్రణాళికలను ఆవిష్కరించింది. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణాన్ని (ఏయూఎం) రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని నిర్దేశించుకుంది. అప్పటికల్లా ఏయూఎంను రూ. 1.2–1.3 లక్షల కోట్లకు చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. తమ రిటైల్ వ్యాపారంలో హోల్‌సేల్ విభాగం వాటాను 33 శాతానికి, రిటైల్ విభాగం వాటాను 67 శాతానికి పెంచుకోవడం ద్వారా దీన్ని సాధించే యోచనలో ఉన్నట్లు వివరించింది. అటు 2024 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి మరో 100 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చైర్మన్ అజయ్ పిరమల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పీఈఎల్ రిటైల్ రుణాల వ్యాపారం 57 శాతం పెరిగి రూ. 34,891 కోట్లకు చేరింది. జూన్ ఆఖరు నాటికి కంపెనీకి 423 శాఖలు, 33 లక్షల పైచిలుకు కస్టమర్లు, సుమారు 13 రకాల రుణ సాధనాలు ఉన్నాయి. -
భారీగా పెరిగిన పెన్షన్ స్కీముల ఆస్తులు
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ స్కీము (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కింద నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ రూ. 10 లక్షల కోట్లకు చేరింది. ఆగస్టు 23న ఈ మైలురాయిని అధిగమించినట్లు పెన్షన్ ఫండ్ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ దీపక్ మహంతి తెలిపారు. రెండేళ్ల 10 నెలల కాలంలో ఏయూఎం రూ. 5 లక్షల కోట్ల నుంచి రెట్టింపైనట్లు వివరించారు. ఎన్పీఎస్, ఏపీవై చందాదారుల సంఖ్య 6.62 కోట్ల పైచిలుకు చేరినట్లు మహంతి చెప్పారు. 2004లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రకటించిన ఎన్పీఎస్ను 2009 నుంచి అందరికీ అందుబాటులోకి తెచ్చారు. దేశ పౌరులు దీన్ని స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చు. మరోవైపు, 2015 జూన్ 1న ఏపీవైని కేంద్రం ఆవిష్కరించింది. 60 ఏళ్లు దాటిన చందాదారులు తాము కోరుకున్నంత నిధిని ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌పై కసరత్తు తుది దశలో ఉందని, అక్టోబర్ లేదా నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని మహంతి వివరించారు. ప్రస్తుతం ఎన్పీఎస్ చందాదారులు 60 ఏళ్లు దాటితే 60 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలుంది. మిగతా 40 శాతం మొత్తం తప్పనిసరిగా యాన్యుటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి. -
50 శాతం ఏయూఎం వృద్ధిపై యూనియన్ ఎంఎఫ్ గురి
ముంబై: యూనియన్ మ్యూచువల్ ఫండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన నిర్వహణ ఆస్తులను (ఏయూఎం) 50 శాతం మేర పెంచుకోనున్నట్టు ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఈ సంస్థ ఏయూఎం రూ.9,853 కోట్లుగా ఉంటే, 2024 మార్చి నాటికి రూ.15,000 కోట్లకు తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎప్పుడో 2012లోనే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ సేవలు ప్రారంభించినప్పటికీ ఇంతకాలం ఆస్తుల్లో వృద్ధి చెప్పుకోతగినంత లేదు. ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన యూనియన్ మ్యూచువల్ ఫండ్‌లో, 39.64 శాతం వాటాను జపాన్‌కు చెందిన దైచీలైఫ్ 2018లో కొనుగోలు చేయడం గమనార్హం. ఈ సంస్థ ఏయూఎంలో టాప్–30 పట్టణాల వాటా 68 శాతంగా ఉంటే, బీ30 (బియాండ్ 30) పట్టణాల నుంచి 32 శాతం ఆస్తులను కలిగి ఉంది. ‘‘మార్చి చివరికి ఉన్న ఏయూఎం రూ.9,853 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం చివరికి రూ.10,700 కోట్లకు చేరుకుంది. వచ్చే మార్చి నాటికి ఇది రూ.15,000 కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం. పెద్ద థీమ్యాటిక్ ఫండ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నాం. దీని ద్వారా రూ.500 కోట్లు సమీకరించగలమని అంచనా వేస్తున్నాం. మార్కెట్‌పైనే ఇది ఆధారపడి ఉంటుంది’’అని యూనియన్ మ్యూచువల్ ఫండ్ సీఈవో జి.ప్రదీప్‌కుమార్ తెలిపారు. కొత్త భాగస్వామి మద్దతుతో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ ఏయూఎంలో వృద్ధి పెద్దగా లేకపోవడానికి బెల్జియంకు చెందిన కేబీసీ తొలుత భాగస్వామిగా ఉండడమేనని ప్రదీప్‌కుమార్ వెల్లడించారు. థర్డ్ పార్టీ విక్రయాలకు ఆ సంస్థ సమ్మతించకపోవడంతో, కేవలం యూనియన్ బ్యాంక్ శాఖల ద్వారానే విక్రయాలు చేయాల్సి వచి్చందన్నారు. 2018లో దైచీ రాకతో అప్పటికీ కేవలం రూ.4,500 కోట్లుగానే ఉన్న ఏయూఎం, ఐదేళ్లలో రెట్టింపైనట్టు చెప్పారు. ఇక ముందూ ఇదే విధంగా వృద్ధిని సాధిస్తామన్నారు. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ కొత్త మైలురాయి
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2.5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి. ఈ సంస్థ 2000 డిసెంబర్లో మొదలైంది. 2020–21 నాటికి ఏయూఎం రూ.100 కోట్లుగా ఉంటే, ఇన్నేళ్ల కాలంలో రూ.2.5 లక్షల కోట్లకు చేరింది. మొదటి రూ.50,000 కోట్ల మైలురాయిని చేరుకునేందుకు తొమ్మిదేళ్లు పట్టగా, రూ.లక్ష కోట్ల ఏయూఎం మార్క్‌ను 14 ఏళ్లలో చేరుకుంది. ఆ తర్వాత ఆరేళ్లలోనే ఏయూఎంను రెట్టింపు చేసుకుంది. రూ.లక్ష కోట్ల మైలురాయిని చేరిన తర్వాత వృద్ధి వేగాన్ని అందుకున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ తెలిపింది. కంపెనీ పట్ల కస్టమర్ల విశ్వాసానికి తమ నిర్వహణలోని ఆస్తులే ప్రామాణికమని, ఎందుకంటే జీవిత బీమా దీర్ఘకాల ఉత్పత్తి అని సంస్థ పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంకు ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ జీవిత బీమా మార్కెట్లో 15.7 శాతంతో మొదటి స్థానంలో ఉంది. 2022 సెప్టెంబర్ నాటికి నూతన పాలసీల సమ్ అష్యూరెన్స్ పరంగా ఈ స్థానం దక్కించుకుంది. -
ఫండ్స్ ఆస్తులు రూ.37.75 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో (ఏప్రిల్ నుంచి జూన్ చివరికి) రూ.37.75 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. 2021 జూన్ నాటికి ఫండ్స్ ఆస్తులు రూ.33.2 లక్షల కోట్లతో పోలిస్తే 14 శాతం పెరుగుదల నమోదైంది. ఈక్విటీ పథకాల్లోకి స్థిరమైన పెట్టుబడుల రావడం ఇందుకు తోడ్పడింది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వివిధ వర్గాలు ఆసక్తి చూపిస్తుండడంతో రానున్న కాలంలో నిర్వహణ ఆస్తులు మరింత వృద్ధి చెందుతాయని నిపుణులు అంటున్నారు. అయి తే, ఈ ఏడాది మార్చి నాటికి (క్రితం త్రైమాసికం) ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.38.8 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ రకంగా చూస్తే వార్షికంగా ఏయూఎం పెరిగినప్పటికీ.. త్రైమాసికం వారీ తగ్గుదల నమోదైంది. డెట్ విభాగంలో పెట్టుబడుల రాకపోకలు అస్థిరంగా ఉంటుంటాయి. ఈ ప్రభా వం త్రైమాసికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫండ్స్ ఆస్తుల్లో వార్షికంగా వృద్ధి నమోదు కావడం ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుందనడానికి నిదర్శంగా ఈ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. నిషేధం లేకపోతే మరింతగా.. ‘‘జూన్ త్రైమాసికంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), లంప్సమ్ (ఏక మొత్తంలో) రూపంలో పెట్టుబడులు స్థిరంగా ఉన్నాయి. నూతన పథకాల (ఎన్‌ఎఫ్‌వోలు) ఆవిష్కరణకు అనుమతిస్తే ఈ పెట్టుబడుల రాక మరింత మెరుగ్గా ఉండేది’’అని శామ్కో సెక్యూరిటీస్ గ్రూపు హెడ్ ఓంకారేశ్వర్ సింగ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి సెబీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటిని అమలు చేసే వరకు కొత్త పథకాల ప్రారంభాన్ని సెబీ నిలిపివేసింది. ‘‘ఈక్విటీ పెట్టుబడులు అందిస్తున్న సంపద సృష్టి మార్గాన్ని మరింత మంది ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. దీర్ఘకాల పరిశ్రమ వృద్ధి అంచనాలకు అనుగుణంగానే గణాంకాలు ఉన్నాయి’’అని ఎన్జే ఏఎంసీ సీఈవో రాజీవ్ శాస్త్రి పేర్కొన్నారు. ‘‘సాధారణంగా మార్కెట్లు పెరగడం లేదా అదనపు పెట్టుబడుల రావడం వల్ల ఆస్తుల్లో వృద్ధి కనిపిస్తుంది. కానీ, మార్కెట్ గత ఏడాది కాలం నుంచి ఫ్లాట్‌గా (వృద్ధి లేకుండా స్థిరంగా) ఉంది. కనుక ఆస్తుల్లో వృద్ధి ప్రధానంగా ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు రావడం వల్లే నమోదైంది’’అని ప్రైమ్ ఇన్వెస్టర్ సహ వ్యవస్థాపకురాలు విద్యా బాల తెలిపారు. గతంతో పోలిస్తే నేడు కార్పొరేట్, రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను గుర్తిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాల లేదా దీర్ఘకాల పెట్టుబడులను ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. అత్యధికి నిర్వహణ ఆస్తులతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మొదటి స్థానంలో కొనసాగింది. -
2022-23లో పెరగనున్న ఎన్బీఎఫ్సీ ఆస్తులు
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్బీఎఫ్సీలు) నిర్వహణలోని ఆస్తులు(రుణాలు/ఏయూఎం) వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2022–23)లో 8-10 శాతం వరకు పెరుగుతాయని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఆస్తుల వృద్ధి 5-7 శాతంగా ఉండొచ్చని తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (గృహ రుణాలు ఇచ్చే సంస్థలు/హెచ్ఎఫ్సీలు) ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9-11 శాతం వరకు పెరుగుతాయని తెలిపింది. ఎన్బీఎఫ్సీలలో రిటైల్ విభాగం, వ్యక్తిగత రుణాలు, మైక్రోఫైనాన్స్, బంగారం రుణాలు ప్రధానంగా వృద్ధికి దోహదపడతాయని వివరించింది. వాహన రుణాలు, వ్యాపార రుణాలు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. ఈ విభాగాల్లో ఆస్తుల నాణ్యత అంశాలు ఇంకా సమసిపోలేదని గుర్తు చేసింది. ఎన్బీఎఫ్సీ హోల్‌సేల్ రుణాల ఏయూఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్షీణిస్తుందని అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికంలో రుణాల పంపిణీ అంచనాలను సవరించామని.. కరోనా మూడో విడత ప్రభావం తక్కువగానే ఉండడంతో నాలుగో త్రైమాసికంలో (2022 జనవరి-మార్చి) సవరించొచ్చని పేర్కొంది. రుణాల మంజూరులో వృద్ధి ఆరోగ్యకరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యాపార వృద్ధి కోసం రూ.1.8-2.2 లక్షల కోట్ల తాజా నిధులు అవసరమవుతాయి’’ అని ఈ నివేదిక వెల్లడించింది. (చదవండి: దేశంలో క్రిప్టోకరెన్సీ ప్రవేశపెట్టే ఆలోచన లేదు: కేంద్రం) -
ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎం డౌన్
ముంబై: నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) వెనకడుగు వేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రుణ పంపిణీ తగ్గడం, పోర్ట్‌ఫోలియో విలువలు క్షీణించడం ప్రభావం చూపినట్లు రేటింగ్స్ సంస్థ ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే గతేడాది(2020–21) ద్వితీయార్థంలో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్ఎఫ్సీ)ల రుణ మంజూరీ పుంజుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అంటే గత క్యూ3(అక్టోబర్–డిసెంబర్), క్యూ4(జనవరి–మార్చి)లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన ఈ క్యూ1లో 55 శాతం తిరోగమించినట్లు తెలియజేసింది. గతేడాది క్యూ1తో పోలిస్తే మారటోరియంలు లేని పరిస్థితుల్లో ఈ క్యూ1లో ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎం నీరసించినట్లు నివేదిక వివరించింది. హెచ్ఎఫ్సీల ఏయూఎం మాత్రం దాదాపు యథాతథంగా నమోదైనట్లు పేర్కొంది. పెంటప్ డిమాండ్ .. పెంటప్ డిమాండ్ కారణంగా ఈ జులైలో రుణ విడుదల ఒక్కసారిగా ఊపందుకున్నట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది. ఈ స్పీడ్ కొనసాగేదీ లేనిదీ స్థూల ఆర్థిక సంకేతాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేసింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ ఎన్బీఎఫ్సీ రంగంలో రికవరీని తాత్కాలికంగా దెబ్బతీసినట్లు ఇక్రా వైస్‌ప్రెసిడెంట్, ఫైనాన్షియల్ రంగ హెడ్ మనుశ్రీ సగ్గర్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలో రుణ మంజూరీ వార్షిక ప్రాతిపదికన 6–8 శాతం పుంజుకోగలదని అంచనా వేశారు. ఇక ఏయూఎం అయితే 8–10 శాతం స్థాయిలో బలపడవచ్చని అభిప్రాయపడ్డారు. గతే డాది లోబేస్ కారణంగా పలు కీలక రంగాల నుంచి డిమాండ్ మెరుగుపడనున్నట్లు తెలియజేశారు. ఆస్తుల నాణ్యతపై.. స్థానిక లాక్డౌన్ల కారణంగా ఈ క్యూ1లో ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల(రుణాల) నాణ్యత భారీగా బలహీనపడినట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే వసూళ్లు ప్రోత్సాహకరంగానే ఉన్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది నికర రికవరీలు, రద్దులతో కూడిన ఓవర్డ్యూస్లో 0.5–1 శాతం పెరుగుదల నమోదుకావచ్చని అంచనా వేసింది. ఇవి ఇకపై లాక్డౌన్లు ఉండబోవన్న అంచనాలుకాగా.. రుణ నాణ్యతపై ఒత్తిళ్లు కొనసాగనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత అనిశి్చతుల నేపథ్యంలో రైటాఫ్‌లు అధికంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది. -
ఎన్‌బీఎఫ్‌సీల అసెట్స్‌లో 15 శాతం వృద్ధి
ముంబై: బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్సీ) సుమారు 42 శాతం సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం తమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎ) 15 శాతం పైగా వృద్ధి చెందుతుందని ఆశాభావంతో ఉన్నట్లు ఇక్రా రేటింగ్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఎన్బీఎఫ్సీలపై కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావాలను, వాటి భవిష్యత్ అంచనాలను తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ వివరించింది. పరిశ్రమ ఏయూఎంలో 60 శాతం వాటా ఉన్న 65 ఎన్బీఎఫ్సీలు ఇందులో పాల్గొన్నట్లు తెలిపింది. చాలా మటుకు ఎన్బీఎఫ్సీలు తమ ఏయూఎం 10 శాతం దాకా వృద్ధి చెందవచ్చని అంచనా వేసుకుంటున్న నేపథ్యంలో మొత్తం పరిశ్రమ వృద్ధి 7–9 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నట్లు ఇక్రా రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ మనుశ్రీ సగ్గర్ తెలిపారు. ఎన్బీఎఫ్సీ సెగ్మెంట్లో అంతర్గతంగా సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ), చిన్న సంస్థలకు రుణాలిచ్చేవి, అఫోర్డబుల్ హౌసింగ్ రుణాలిచ్చే సంస్థలు మిగతా వాటికన్నా మరింత అధిక వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. లాక్డౌన్ల సడలింపు, కొత్త కోవిడ్ కేసులు ఒక మోస్తరు స్థాయికి పరిమితం అవుతుండటం, టీకాల ప్రక్రియ పుంజుకోవడం వంటి అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మిగతా భాగంలో గత ఆర్థిక సంవత్సరం కన్నా వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని ఎన్బీఎఫ్సీలు భావిస్తున్నట్లు ఇక్రా రేటింగ్స్ తెలిపింది. -
తొలి క్వార్టర్లో మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం రూ.25 లక్షల కోట్లు
మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.25లక్షల కోట్లకు చేరుకున్నాయి. క్రితం త్రైమాసికంలో నమోదైన రూ.27 లక్షల కోట్లు ఏయూఎంతో పోలిస్తే ఇది 8శాతం తక్కువ. ఈ తొలి త్రైమాసికంలో ఈక్విటీలు, డెట్ మార్కెట్లలో అవుట్‌ఫ్లో ఒత్తిళ్లు పెరగడంతో ఆస్తుల నికర విలువ తగ్గినట్లు భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ తెలిపింది. మ్యూచువల్ ఫండ్ల పరిశ్రమలోని 45 సంస్థల నిర్వహణలోని ఆస్తులు రూ.24.82లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో నిఫ్టీ ఇండెక్స్ 24శాతం ర్యాలీ చేసినప్పటికీ... డెట్, ఈక్విటీ మార్కెట్లో అవుట్‌ఫ్లోలు పెరగడంతో ఫండింగ్ సంస్థలు ఒత్తిడికి లోనయ్యాయి. మ్యూచువల్ ఫండ్ ఫథకాల్లో నికర ఇన్‌ఫ్లో తగ్గడంతో త్రైమాసిక ప్రాతిపదికన ఇండస్ట్రీస్ 8శాతం క్షీణతను చవిచూసినట్లు సామ్కో సెక్యూరిటీస్ తెలిపింది. ప్రస్తుతం 45 ఫండ్ హౌస్‌లు ఉన్నాయి. ఇందులో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్ లైఫ్, నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ టాప్-5 ఫండింగ్ సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఇందులో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.3.64లక్షల కోట్ల ఏయూఎంతో అగ్రస్థానంలోనూ, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ రూ.3.56లక్షల కోట్లతో రెండో స్థానంలో, ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ రూ.3.46లక్షల కోట్ల ఏయూఎంతోనూ మూడో స్థానంలో ఉన్నాయి. -
మ్యూచువల్ ఫండ్ ఏయూఎంలో 13 % వృద్ధి
న్యూఢిల్లీ: గతేడాదిలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు జోరుమీద కొనసాగాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించడం కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తీసుకున్న చర్యల నేపథ్యంలో భారీ స్థాయి పెట్టుబడులను ఆకర్షించాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) గతేడాదిలో రూ. 3.15 లక్షల కోట్లు (13 శాతం వృద్ధి) పెరిగాయి. దీంతో అంతక్రితం ఏడాది (2018)లో రూ. 23.62 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం పరిశ్రమ నిర్వహణ ఆస్తి.. గత నెల చివరినాటికి రూ. 26.77 లక్షల కోట్లకు చేరుకుంది. -
మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు రూ. 10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల (ఏయూఎం) విలువ 7.2 శాతం ఎగిసింది. రూ. 10.6 లక్షల కోట్లకు చేరింది. భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం అంతక్రితం త్రైమాసికంలో ఇది రూ. 9.87 లక్షల కోట్లుగా నమోదైంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ మే నెలలో తొలిసారిగా ఏయూఎంల విలువ తొలిసారిగా రూ. 10 లక్షల కోట్ల మార్కును దాటింది. ప్రస్తుతం 45 ఫండ్ హౌస్‌లు ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ రూ. 1.41 లక్షల కోట్ల ఏయూఎంతో అగ్రస్థానంలోను, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్ రూ. 1.27 లక్షల కోట్లతో రెండో స్థానంలో, రిలయన్స్ ఎంఎఫ్ రూ. 1.22 లక్షల కోట్ల ఏయూఎంతో మూడో స్థానంలో ఉన్నాయి. -
ఫండ్స్‌కు కొత్త నిబంధనల అమలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ రంగానికి సంబంధించి మంగళవారం(ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఇకపై నెలకోసారి తమ నిర్వహణలోని ఆస్తుల వివరాలు ఫండ్స్ వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓటింగ్ హక్కులను వినియోగించుకుంటే అందుకు తగిన కారణాలను వెల్లడించాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్ రంగంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూపొందించిన తాజా నిబంధనలను ఫండ్ హౌస్‌లు ఇకపై తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వివిధ విభాగాలకు చెందిన పథకాల ద్వారా ఫండ్స్ నిర్వహిస్తున్న ఆస్తులు, ఇన్వెస్టర్ల వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. తమ వెబ్సైట్ల ద్వారా ప్రతీ నెల కు సంబంధించిన వివరాలను 7 రోజుల్లోగా ప్రకటించాల్సి ఉంటుంది. దీంతోపాటు దేశీ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వెబ్సైట్లలో కూడా వివరాలను ప్రకటించాలి. ఈ బాటలో ప్రతీ క్వార్టర్ ముగిశాక 10 రోజుల్లోగా ఓటింగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించాలి. వార్షిక నివేదికలోనూ ఈ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఓటింగ్ హక్కుల వినియోగంపై ఆడిటర్ల నుంచి సర్టిఫికేషన్‌ను పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 45 ఫండ్ హౌస్‌లు కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 9 లక్షల కోట్లకుపైనే. -
2020 నాటికి... 60 లక్షల కోట్లకు జీవిత బీమా మార్కెట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలున్న నేపథ్యంలో 2020 నాటికి జీవిత బీమా సంస్థల నిర్వహణలో ఉండే ఆస్తుల విలువ (ఏయూఎం) రూ. 60 లక్షల కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (ఎల్ఐసీ) సెక్రటరీ జనరల్ సీఏ.వి. మాణిక్యం తెలిపారు. అప్పటికి బీమా తీసుకోతగిన వారి సంఖ్య 75 కోట్లకు, సగటు జీవన కాలం 74 ఏళ్లకు పెరగగలదని వివరించారు. ప్రస్తుతం జీవిత బీమా రంగం రూ. 20 లక్షల కోట్లుగా ఉండగా.. 32 కోట్ల పైచిలుకు పాలసీ దారులు ఉన్నట్లు మాణిక్యం చెప్పారు. బీమా ఆవశ్యకత గురించి అవగాహన పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని గురువారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలవారికీ జీవిత బీమా పాలసీలు అందించే దిశగా వివిధ మార్గాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. 2020 నాటికి ఇన్ఫ్రా రంగంలోకి జీవిత బీమా రంగం పెట్టుబడులు రూ. 1.73 లక్షల కోట్ల నుంచి రూ. 3.5 లక్షల కోట్లకు పెరగగలవని తెలిపారు. అలాగే ఈ రంగంలో ప్రస్తుతం 2.41 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య అయిదు లక్షలకు పెరుగుతుందని మాణిక్యం చెప్పారు. మరోవైపు, జీవిత బీమా వ్యాపారం భారీగా పెరగడానికి అపార అవకాశాలు ఉన్నాయని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అవేర్నెస్ కమిటీ చైర్మన్ రాజేశ్ సూద్ చెప్పారు. కొత్త ప్రీమియం చెల్లింపులు ఒక మోస్తరుగానే ఉన్నా .. రెన్యువల్ ప్రీమియాల ఆదాయం గణనీయంగానే పెరుగుతోందని ఆయన వివరించారు. ఈ ఏడాది జనవరిలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి సుమారు 367 కొత్త పథకాలను జీవిత బీమా సంస్థలు అందుబాటులోకి తెచ్చాయని తెలిపారు. అటు క్లెయిముల విషయంలో జీవిత బీమా సంస్థలు కొర్రీలు పెడుతుంటాయన్న ఆరోపణలు సరికాదని సూద్ చెప్పారు. సెటిల్మెంట్ రేటు 97 శాతం స్థాయిలో ఉంటోందని ఆయన చెప్పారు. సగటున ప్రతి గంటకు 50 క్లెయిముల మేర, ఏటా దాదాపు 5 లక్షల క్లెయిములను పరిష్కరిస్తున్నామని సూద్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం 3.42 లక్షల ఫిర్యాదులు రాగా 99.64 శాతం పరిష్కరించామన్నారు.


