ఈక్విటీ ఫండ్స్‌కు తగ్గుతున్న ఆకర్షణ! | Key Highlights from October 2025 Equity Fund Report | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఫండ్స్‌కు తగ్గుతున్న ఆకర్షణ!

Nov 12 2025 9:06 AM | Updated on Nov 12 2025 11:13 AM

Key Highlights from October 2025 Equity Fund Report

అక్టోబర్‌లో 19 శాతం తక్కువ పెట్టుబడులు

రూ.24,691 కోట్లకు పరిమితం

సిప్‌ రూపంలో రూ.29,529 కోట్లు 

ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు ఫండ్స్‌లో తాజా పెట్టుబడులపై ప్రభావం చూపిస్తున్నాయి. అక్టోబర్‌లోనూ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ 19 శాతం తక్కువగా రూ.24,691 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. సెప్టెంబర్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.30,422 కోట్లుగా ఉండడం గమనార్హం. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) ఈ గణాంకాలను విడుదల చేసింది. బంగారం ధరల ర్యాలీ మద్దతుతో గోల్డ్‌ ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు)లోకి మరిన్ని పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో రూ.7,743 కోట్ల తాజా పెట్టుబడులను గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. నెలవారీ గరిష్ట రికార్డు ఇది. దీంతో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ మొదటిసారి రూ.లక్ష కోట్ల మార్క్‌ను అధిగమించింది.  

సిప్‌ పెట్టుబడులు స్థిరం..

దీర్ఘకాల లక్ష్యాల కోసం క్రమానుగత పెట్టుబుడుల (సిప్‌) విషయంలో ఇన్వెస్టర్ల ధోరణి స్థిరంగానే కొనసాగుతోంది. ఇందుకు నిదర్శనంగా సిప్‌ ద్వారా అక్టోబర్‌లో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచి్చన పెట్టుబడులు రూ.29,529 కోట్లుగా ఉన్నాయి. సెపె్టంబర్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.29,631 కోట్లతో పోల్చితే స్వల్ప తగ్గుదల కనిపించింది.  

విభాగాల వారీగా..

  • అక్టోబర్‌లో డివిడెండ్‌ ఈల్డ్‌ ఫండ్స్, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ మినహా మిగిలిన విభాగాల పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి.  

  • అత్యధికంగా ఫ్లెక్సీకాŠయ్ప్‌ ఫండ్స్‌లోకి రూ.8,928 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సెపె్టంబర్‌లో వచి్చన రూ.7,029 కోట్లతో పోల్చి చూస్తే 27 శాతం పెరిగాయి.  

  • మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ సెపె్టంబర్‌ నెల కంటే 25 శాతం తక్కువగా రూ.3,807 కోట్లు, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ 20 శాతం తక్కువగా రూ.3,476 కోట్లు చొప్పున ఆకర్షించాయి.

  • లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.3,177 కోట్లు, మల్టీక్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.2,500 కోట్లు, లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌లోకి రూ.972 కోట్లు, ఫోకస్డ్‌ ఫండ్స్‌లోకి రూ.939 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.  

  • సెక్టోరల్‌/థీమ్యాటిక్‌ ఫండ్స్‌ రూ.1,366 కోట్లు ఆకర్షించాయి.

  • ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ నుంచి రూ.665 కోట్లు, డివిడెండ్‌ ఈల్డ్‌ ఫండ్స్‌ నుంచి రూ.179 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు.  

  • డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రూ.1.59 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు రెండు నెలల్లోనూ ఇవి నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి.  

  • డెట్‌ విభాగంలో లిక్విడ్‌ ఫండ్స్‌ రూ.89,375 కోట్లు, ఓవర్‌నైట్‌ ఫండ్స్‌ రూ.24,050 కోట్లు, అల్ట్రా షార్ట్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ రూ.15,066 కోట్లు చొప్పున రాబట్టాయి.  

  • హైబ్రిడ్‌ ఫండ్స్‌లోకి (ఈక్విటీ, డెట్‌ కలయిక) 14,156 కోట్ల పెట్టబుడులు వచ్చాయి. సెప్టెంబర్‌లో పెట్టుబడులు రూ.9,397 కోట్ల కంటే 51 శాతం పెరిగాయి.  

  • ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌లోకి రూ.6,919 కోట్లు, మల్టీ అసెట్‌ ఫండ్స్‌లోకి రూ.5,344 కోట్లు చొప్పున పెట్టుబడులు వచ్చాయి.  

  • బ్యాలన్స్‌డ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌/అగ్రెస్సివ్‌ హైబ్రిడ్‌ ఫండ్స్‌లోకి రూ.1,139 కోట్లు వచ్చాయి.  

  • ప్యాసివ్‌ ఫండ్స్‌ అయిన ఇండెక్స్‌ ఫండ్స్, ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు 13 శాతం తగ్గి రూ.16,668 కోట్లకు పరిమితమయ్యాయి.

  • అక్టోబర్‌లో 18 కొత్త పథకాలు (న్యూఫండ్‌ ఆఫర్‌/ఎన్‌ఎఫ్‌వో) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.6,062 కోట్ల పెట్టుబడులను సమీకరించాయి.  

  • అక్టోబర్‌ చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) సెప్టెంబర్‌ నుంచి 5 శాతం పెరిగి రూ.79.88 లక్షల కోట్లకు పెరిగింది.  

లాభాల స్వీకరణ వల్లే..

ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం ఫలితంగా ఈక్విటీల్లోకి పెట్టుబడులు తగ్గినట్టు యాంఫి సీఈవో వీఎన్‌ చలసాని తెలిపారు. ‘‘సిప్‌ ఏయూఎం రూ.16.25 లక్షల కోట్లకు చేరింది. పరిశ్రమ మొత్తం ఏయూఎంలో సిప్‌ వాటా ఐదంట ఒక వంతుకు చేరింది. మొత్తం యాక్టివ్‌ సిప్‌ ఖాతాలు 9.45 కోట్లకు పెరిగాయి’’అని చలసాని తెలిపారు.

ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement