
టాలీవుడ్ డైరెక్టర్ బాబీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిష్కింధపురి సక్సెస్‌ఫుల్ ఈవెంట్‌కు హాజరైన ఆయన మెగాస్టార్ చిరంజీవి సినిమాపై మాట్లాడారు. అనిల్ రావిపూడి- చిరంజీవి కాంబోలో వస్తోన్న మనశంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ కొట్టబోతోందని అన్నారు. ఈ మూవీలోని కొన్ని సీన్స్ నేను చూసి ఈ మాట చెబుతున్నానని బాబీ పేర్కొన్నారు. మెగాస్టార్ ఖాతాలో మరో హిట్ ఖాయమని చెప్పారు.
అంతకుముందు జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌పై ఫన్నీ కామెంట్స్ చేశారు. అనుదీప్, అనిల్ రావిపూడితో కలిసి కిష్కింధపురి సినిమా చూశామని తెలిపారు. అయితే ఈ సినిమాలో చూసినప్పుడు అనుపమ కనిపించగానే అనుదీప్ అరుస్తూనే ఉన్నాడని అన్నారు. ఇదీ చూసి ఏంటి ఇలా అరుస్తున్నాడు.. అదేంటో మాకు అర్థం కాలేదు..మనం హీరో వస్తే కదా అరవాలి.. ఇతనేంటి అనుపమ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ హా ఏంటి అనుకున్నా అంటూ నవ్వులు పూయించాడు. కాగా.. ఇటీవల విడుదలైన కిష్కింధపురి చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
#ManaShankaraVaraPrasadGaru సినిమా పెద్ద హిట్ కొట్టబోతుంది - Director #Bobby#Chiranjeevi #AnilRavipudi #Kishkindhapuri pic.twitter.com/ElqNM3Frwj
— Telugu FilmNagar (@telugufilmnagar) September 18, 2025