
ఈ రోజు మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా చిరంజీవి సినిమాల అప్డేట్స్ రావడంతో డబుల్ ఎనర్జీతో పుట్టినరోజును ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ను కూడా రివీల్ చేశారు. టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరు గురించి మాట్లాడారు.
చిరంజీవి సినిమాల్లో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు అంటే తనకు చాలా ఇష్టమన్నారు. రీ ఎంట్రీలో చిరంజీవి స్వాగ్ను చూపించాలకున్నట్లు తెలిపారు. చివరగా నాకు ఆ అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి ఉంటుందని అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మీకు డబుల్ డోస్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తానని అన్నారు.
కాగా.. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తోంది. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్‌పై ఆధారంగా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో అన్నారు. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నారు. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.