
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi,), అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్ కెరీర్‌లో గుర్తిండిపోయేలా సినిమా ఉంటుందని అనిల్ చెబుతున్నాడు.
ఇందులో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వింటేజ్ చిరంజీవి ఇందులో చూపించబోతున్నాడట. కామెడీతో పాటు మెగా ఫ్యాన్స్ ఆశించే యాక్షన్ కూడా ఇందులో ఉంటుందట. ఇందుకోసం అనిల్ బలమైన సీన్లు రాసుకున్నాడట. అంతేకాదు చిరంజీవిని ఢీకొట్టే విలన్‌గా ఓ యంగ్ హీరోని చూపించబోతున్నారట. అతనెవరో కాదు మెగాస్టార్ వీరాభిమాని కార్తికేయ(Kartikeya Gummakonda).

ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు కార్తీకేయ. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో విలన్‌గానూ నటించాడు. నాని ‘గ్యాంగ్ లీడర్’ తో పాటు అజిత్ ‘తెగింపు’లో కార్తికేయ విలన్‌గా నటించి అందరిని మెప్పించాడు. ఇప్పుడు మళ్లీ చిరంజీవి సినిమాలో నెగెటివ్ రోల్ చేయనున్నాడు.
అయితే ఇందులో విలన్ కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కామెడీ కూడా చేస్తాడట. ఈ పాత్రకు కార్తికేయ అయితేనే న్యాయం చేస్తాడని అనిల్ అతన్ని సంప్రదించారట. చిరంజీవి సినిమా అనగానే కార్తికేయ కథ వినకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా టాలీవుడ్‌లో వినిపిస్తున్న రూమర్స్ మాత్రమే. చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కార్తికేయ కూడా దీనిపై స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చిరంజీవితో కలిసి నటించాలనుకున్న కార్తికేయ డ్రీమ్ ఫుల్ ఫిల్ అయినట్లే.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంకో సర్‌ప్రైజ్ కూడా ఉందట. విక్టరీ వెంకటేశ్ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతిథి పాత్రలో ఆయన నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.