అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతికి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
సినీరంగంలో అందించే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకలకు ఎంపికైంది. ఈ నెల 20న గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) అవార్డుల వేడుకలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఇండియన్ పనోరమ(ఫీచర్ ఫిల్మ్స్) విభాగంలో అఫీషియల్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. టాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిందని మేకర్స్ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా ఇవాళ పలు అవార్డులకు నామినేట్ వారి జాబితాను నిర్వాహకులు వెల్లడించారు. దీంతో పాటు ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ విభాగంలో టాలీవుడ్ డైరెక్టర్ యదు వంశీ నామినేట్ అయ్యారు. కమిటీ కుర్రోళ్లు చిత్రానికిగానూ ఆయనకు నామినేషన్ దక్కింది. ఇదే విభాగంలో.. మలయాళం నుంచి జితిన్‌లాల్ (ఎ.ఆర్.ఎం), హిందీ నుంచి కరణ్ సింగ్‌త్యాగి (కేసరి చాప్టర్ 2) బెంగాలీ నుంచి రామ్ కమల్ ముఖర్జీ (బినోదిని)పోటీపడుతున్నారు.
#SankranthikiVasthunam has been officially selected for the Indian Panorama (Feature Films) at the International Film Festival of India (IFFI) 2025 ❤️🔥❤️🔥❤️🔥
Another remarkable milestone for a film that set a new benchmark for regional films in TFI 💥
An @AnilRavipudi film 🔥… pic.twitter.com/eMP57q7Zw9— Sri Venkateswara Creations (@SVC_official) November 7, 2025


