‘వెల్‌కమ్ వెంకీ... మై బ్రదర్!’ అంటూ వెంకటేశ్‌ని ఆప్యాయంగా సెట్స్‌కి ఆహ్వానించారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు వెంకటేశ్. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించి, ఓ వీడియోను విడుదల చేసింది. ‘వెల్‌కమ్ వెంకీ... మై బ్రదర్...’ అంటూ చిరంజీవి ఆప్యాయంగా వెంకటేశ్‌ని పిలవగా, ‘చిరు సార్... మై బాస్...’ అంటూ చిరంజీవిని హత్తుకున్నారు వెంకటేశ్.
‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా సంక్రాంతికి పర్ఫెక్ట్ ట్రీట్. చిరంజీవి– వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఫ్యాన్స్‌కి డబుల్ ఫెస్టివల్. ఈ సినిమాలో వెంకటేశ్ లెంగ్తీ, క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో చిరంజీవి–వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రబృందం తెలిపింది. కాగా.. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.


