'మన శంకర వరప్రసాద్ గారు' ఫేక్‌ కలెక్షన్స్‌.. అనిల్‌ సమాధానం | Anil ravipudi Comments on Mana shankaravaraprasad garu collections | Sakshi
Sakshi News home page

'మన శంకర వరప్రసాద్ గారు' ఫేక్‌ కలెక్షన్స్‌.. అనిల్‌ సమాధానం

Jan 24 2026 12:12 PM | Updated on Jan 24 2026 12:35 PM

Anil ravipudi Comments on Mana shankaravaraprasad garu collections

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు'  సినిమా కలెక్షన్స్‌పై వస్తున్న రూమర్స్‌కు దర్శకుడు అనిల్‌ రావిపూడి తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, కొందరు అదంతా ఫేక్‌ కలెక్షన్స్‌ అంటూ ట్రోల్స్‌ చేయడం ప్రారంభించారు. దీంతో దర్శకుడు స్పందించారు.

'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం టాలీవుడ్‌లో అనేక రికార్డ్‌లను అధిగమించి సత్తా చాటుతుంది. ఇప్పటికీ బుక్‌మైషోలో టికెట్ల అమ్మకాల్లో ట్రెండింగ్‌లో ఉంది. కానీ,   'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా కలెక్షన్ నంబర్స్‌ ఫేక్‌ వేశారని సోషల్‌మీడియాలో కొందరు పోస్టులు షేర్‌ చేశారు. ఇదే అంశంపై అనిల్‌ ఇలా స్పందించారు. 'ఈ సంక్రాంతికి చాలా సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చాయి. అయితే, తాము చాలా ఓపెన్‌గానే కలెక్షన్స్‌ వివరాలు ఎప్పటికప్పడు ప్రకటిస్తూనే ఉన్నాం. వాటిని కొందరు మీడియా మిత్రులు కూడా షేర్‌ చేస్తూనే ఉన్నారు. అందులో ఎలాంటి దాపరికం లేదు. 

ఫేక్‌ కలెక్షన్స్‌ వివరాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రేక్షకులు చిరంజీవిని ఎలా చూడాలని అనుకున్నారో అంతే రేంజ్‌లో మేము తెరపై ఆయన కనిపించేలా జాగ్రత్త పడ్డాం. ముఖ్యంగా చిరంజీవి ఫ్యాన్స్‌ ఎక్కడెక్కడో ఉన్నవారంతా థియేటర్‌కు వచ్చేశారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ సినిమా చూశారు. అందుకే బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ పెరిగాయి. కేవలం వారంలోనే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ అయిపోయింది. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్స్‌ యజమానులకు కూడా లాభాలు వచ్చేశాయి.  అని  అనిల్‌ రావిపూడి పేర్కొన్నారు.​

బుక్‌మై షోలోనూ ఈ మూవీ టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటివరకు 25 మిలియన్‌ టికెట్లు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేవారి సంఖ్య ఊహించలేమని మేకర్స్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement