
వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie) రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం నేడు ఓటీటీలో, టీవీలో ఒకేసారి ముందుకు వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనిల్ రావిపూడి భవిష్యత్తులో కుదిరితే హీరోగా సినిమా చేస్తానన్నాడు. ఆ సినిమాకు హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని తీసుకోండి, మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని యాంకర్ అనడంతో అతడు ఆశ్చర్యపోయాడు.
దారుణమైన కథలు ప్రచారం..
ఆ కామెంట్‌కు అనిల్ స్పందిస్తూ.. మా మధ్య కెమిస్ట్రీలు, ఫిజిక్స్‌లు ఏం లేవు. ఇప్పటికే మా గురించి యూట్యూబ్‌లో రకరకాలుగా రాస్తున్నారు. నాయనా.. నేనేదో ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నాను. వీళ్లేమో యూట్యూబ్‌లో వాయిస్ ఓవర్‌తో ఘోరమైన కథలు ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలు నా భార్యకు, కుటుంబానికి వాట్సాప్‌లో పంపిస్తున్నారు. నా గురించి ఏ స్టోరీలు రాయకండ్రా బాబూ.. దీనిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను.
ఎలాంటి కెమిస్ట్రీ లేదు
మర్యాదగా ఆ వీడియోలు యూట్యూబ్‌లో నుంచి తీసేయండి. లేదంటే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. నాకెటువంటి కెమిస్ట్రీలు లేవు. నా గురించే కాదు చాలామంది గురించి ఇలాగే కథలు అల్లుతున్నారు. వ్యూస్ కోసం లేని కథను అందమైన వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేస్తున్నారు. చాలామంది అది నిజమని నమ్ముతున్నారు. దానివల్ల చాలామంది వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నారు. లేనిపోనివి రాయకండి అని అనిల్ రావిపూడి కోరాడు.
చదవండి: సంజయ్-నమ్రత సినిమా.. రెండు పెగ్గులేసి వెళ్లా: డైరెక్టర్