మాస్ డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట చిరంజీవి, వెంకటేశ్. ఈ స్టార్స్ ఇద్దరితో ఓ సెలబ్రేషన్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా, ముఖ్య పాత్రల్లో వెంకటేశ్, క్యాథరీన్, వీటీవీ గణేశ్ నటిస్తున్నారు.
ఆల్రెడీ చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్‌లో గత నెలాఖర్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కాగా ఈ చిత్రంలో ఓ సెలబ్రేషన్ సాంగ్ ఉందని, ఈ పాటలో చిరంజీవి, వెంకటేశ్‌తో పాటు నయనతార, క్యాథరీన్ కూడా డ్యాన్స్ చేస్తారని టాక్. ఈ పాటను ఈ నెలాఖరున చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.


