ఆయన నమ్మకమే ఇక్కడి వరకు నడిపించింది: అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్ | Tollywood Director Anil Ravipudi emotional Post about his First Movie | Sakshi
Sakshi News home page

Anil Ravipudi: ఆ టాలీవుడ్ హీరోకు ఎప్పటికీ రుణపడి ఉంటా: అనిల్ రావిపూడి ఎమోషనల్

Jan 23 2026 4:23 PM | Updated on Jan 23 2026 4:35 PM

Tollywood Director Anil Ravipudi emotional Post about his First Movie

ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్‌ చిరంజీవితో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించాడు. ఈ జనవరి 12న రిలీజైన మనశంకర వరప్రసాద్‌గారు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో మెప్పించారు.

ఇప్పటివరకు తాను 9 సినిమాలతో హిట్‌ కొట్టిన ఏకైక టాలీవుడ్ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్‌తో మొదలైన అనిల్ ప్రయాణం టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్‌2,ఎఫ్‌3 చిత్రాలతో తన మార్క్ చూపించారు. సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో సూపర్ హిట్స్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తన పదో సినిమాకు కూడా రెడీ అయిపోయారు అనిల్ రావిపూడి.

అయితే తన మొదటి సినిమా పటాస్ రిలీజై సరిగ్గా నేటికి 11 ఏళ్లు పూర్తి కావడంతో అనిల్ రావిపూడి ఎమోషనల్ ట్వీట్ చేశారు. పటాస్‌ను గుర్తు చేసుకుంటూ పోస్టర్‌ను షేర్ చేశారు. తాను ప్రేక్షకుల  హృదయాల్లోకి అడుగుపెట్టి నేటికి 11 ఏళ్లు పూర్తయిందన్నారు. ఇంత కీలకమైన బాధ్యతను నాపై నమ్మకంతో, అపారమైన విశ్వాసంతో నాకు అండగా నిలిచిన నా మొదటి హీరో శ్రీ నందమూరి కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని ట్వీట్ చేశారు. ఆ నమ్మకమే నాకు నిర్భయంగా ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చిందని ఎమోషనల్‌ పోస్ట్ చేశారు. ఈ సినిమా నా జీవితంలోకి తీసుకువచ్చిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, భావోద్వేగాలు, ఆనందం వెలకట్టలేనివని.. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఈ ప్రయాణం నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుందని ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement