‘‘గౌతమ్ ఎస్‌ఎస్‌సీ’ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ఆ చిత్రంలో అభి మంచి పాత్ర చేశాడు. మేము చాలా ఏళ్లు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. కందిరీగ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు రాసేందుకు అభి సాయం చేశాడు. అదిరే అభిగా ‘జబర్దస్త్’తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దర్శకుడిగానూ ‘చిరంజీవ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్‌కు ఈ సినిమా మంచి కమ్ బ్యాక్ కావాలి. ‘చిరంజీవ’ చిత్రం ఘన విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు.
ఆహాలో చిరంజీవ మూవీ
రాజ్ తరుణ్, కుషిత కల్లపు జోడీగా నటించిన చిత్రం ‘చిరంజీవ’ (Chiranjeeva Movie). అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీమియర్ షోకి, ప్రెస్ మీట్‌కి అనిల్ రావిపూడి అతిథిగా హాజరయ్యారు.
పన్నెండేళ్లుగా ట్రై చేస్తున్నా..
రాజ్ తరుణ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం కోసం అభి మా అందరి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు’’ అని తెలిపారు. ‘‘చిరంజీవ’ అందర్నీ నవ్విస్తుంది’’ అన్నారు రాహుల్ అవుదొడ్డి. అభినయ కృష్ణ మాట్లాడుతూ– ‘‘పది పన్నెండేళ్ల నుంచి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఆహా నుంచి శ్రావణిగారికి ‘చిరంజీవ’ కథ నచ్చడంతో ఈ సినిమా తీశారు’’ అన్నారు.
చదవండి: స్పిరిట్‌లో దగ్గుబాటి హీరో? కెరీర్ టర్న్ అవడం ఖాయం!


