డార్లింగ్ ప్రభాస్ (Prabhas) చాలా బిజీ అయిపోయాడు. ఒకదానివెంట మరొకటి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రాజాసాబ్ రిలీజ్‌కు దగ్గరపడితే ఫౌజీ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు స్పిరిట్ మూవీ.. ఆ వెంటనే సలార్, కల్కి సినిమా సీక్వెల్స్ చేయనున్నాడు. రాజాసాబ్ రిలీజే కాలేదు. అప్పుడే దాని సీక్వెల్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
స్పిరిట్ సంగతులు
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు సందీప్‌రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమాయే స్పిరిట్. ఇటీవలే ఈ మూవీ ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేసి.. కావాల్సినంత హైప్ తీసుకొచ్చారు. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ప్రకటించారు.
దగ్గుబాటి హీరో?
అలాగే కొరియన్ నటుడు డాన్‌లీ కూడా సినిమాలో భాగమైనట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. దగ్గుబాటి హీరో కూడా ఈ సినిమాలో భాగమయ్యాడట! ఆ హీరో మరెవరో కాదు, రానా తమ్ముడు అభిరామ్. ఫుల్ యాటిట్యూడ్ ఉండే పాత్రలో అభిరామ్‌ను ఎంపిక చేశారట! మరి ఇదెంతవరకు నిజమన్నది చూడాలి!
నిజమైతే కెరీర్ టర్న్ అయినట్లే!
అభిరామ్.. అహింస సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వం అనగానే మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కట్ చేస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అసలు ఎప్పుడొచ్చిందో, ఎప్పుడెళ్లిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. అయినప్పటికీ అభిరామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడేకంగా రెండో సినిమాకే స్పిరిట్‌లో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ నడుస్తోంది. ఇది నిజమైతే అతడి పంట పండినట్లే!
చదవండి: పవన్‌కు అన్యాయం.. గౌరవ్‌పై దివ్య చిన్నచూపు? భోజనం కట్


