
మెగాస్టార్ చిరంజీవి,అనిల్ రావిపూడి తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) ఈరోజు హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలు అందించిన అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఈ చిత్రం రానుంది.
తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావిపూడి నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు (మే 23) హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ప్రాజెక్ట్‌పై అనిల్‌తో పాటు చిరంజీవి కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తాజాగా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకుని మంచి జోరు మీదున్న అనిల్ రావిపూడి, తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. టెక్నికల్ క్రూ పరిచయ వీడియో, తర్వాత నయనతార ప్రోమో వీడియో ఆడియన్స్ ని కట్టిపడేసింది.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు, ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు.