'అసలు నీవల్ల ఏంటి ఉపయోగం అనేవారు'.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ | Tollywood Music Director Bheems Ceciroleo about His Journey | Sakshi
Sakshi News home page

Bheems Ceciroleo: 'నువ్వు ఎందుకు పనికిరావు ‍అనేవారు'.. భీమ్స్ ఎమోషనల్ కామెంట్స్

Jan 13 2026 7:26 PM | Updated on Jan 13 2026 7:38 PM

Tollywood Music Director Bheems Ceciroleo about His Journey

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ మనశంకర వరప్రసాద్‌గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వీరిద్దరి కాంబో అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వెంకీ మామ కూడా ఈ మూవీలో కనిపించడంతో క్రేజ్ మరింత పెరిగిపోయింది. మూవీకి హిట్ టాక్ రావడంతో మెగా బ్లాక్‌బస్టర్‌ థ్యాంక్యూ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

చిన్నప్పుడు మా నాన్న నన్ను తిట్టేవాడని భీమ్స్ సిసిరోలియో అన్నారు. నువ్వు దేనికి రావు రా.. నీవల్ల ఏంటి ఉపయోగం అని అనేవారని గుర్తు చేసుకున్నారు. నాన్న ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను.. నా ముందు అనిల్ రావిపూడి ఉన్నారు.. నా వెనుక చిరంజీవి గారు ఉన్నారని ఎమోషనలయ్యారు. ఇది ఒక మాటతోనో.. చేసిన పాటలతోనో చెప్పుకునేది కాదు.. మీరు నన్ను ఎందుకు నమ్ముతారో తెలియదు.. నన్ను తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నారంటూ అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించారు. ఈ వేదిక నుంచి చెబుతున్నా.. నీ తల్లిదండ్రులకు, నీకు నా పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

భీమ్స్ మాట్లాడుతూ..' చిన్నప్పుడు నీ వల్ల ఏంటిరా ఉపయోగం అని నాన్న తిట్టేవారు. నాన్నా.. ఇప్పుడు ఇక్కడున్న.. నా ముందు అనిల్‌గారు.. నా వెనుక చిరంజీవిగారు ఉన్నారు. చాలా మంది చాలా రకాలుగా చెప్పినా భీమ్స్‌ ఉంటే బాగుంటుందని నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. నా కష్టానికి మీరు చూపించిన ప్రేమకు రుణపడి ఉంటా.  సినిమా మొదలైనప్పటి నుంచి నాకు ఒక్కటే అనిపిస్తోంది. ఒక సాధారణ కానిస్టేబుల్‌ కొడుకు మెగాస్టార్‌ అయ్యాడు. ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కొడుకు గొప్ప దర్శకుడు అయ్యాడు. ఒక సాధారణ రైతు కొడుకునైన నేను వాళ్లతో కలిసి పనిచేశాను. కర్షకుడు, కార్మికుడు, రక్షకుడు.. ఇలా ముగ్గురు కలిసిన త్రివేణి సంగమంలా అనిపిస్తోంది' అని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement