ఆ సీన్‌ రీల్స్‌ పిల్లలకు చూపించొద్దు : అనిల్‌ రావిపూడి | Anil Ravipudi Made Interesting Comments On Chiranjeevi Makeover, Comedy Timing And Mana Shankara Varaprasad Garu Massive Success | Sakshi
Sakshi News home page

మన శంకర వరప్రసాద్‌గారు.. ఆ రీల్స్‌ పిల్లలకు చూపించొద్దు : అనిల్‌ రావిపూడి

Jan 23 2026 9:23 AM | Updated on Jan 23 2026 12:18 PM

Anil Ravipudi Talk About Mana Shankara Varaprasad Garu Movie

‘‘నా టార్గెట్‌ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమే. ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి, నా సినిమాలు చూస్తూ నవ్వుతుంటే అదే నాకు ఎనర్జీ. ఆ నవ్వే నా సక్సెస్‌ సీక్రెట్‌ ’’ అని అనిల్‌ రావిపూడి అన్నారు. చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ‘‘మా  సినిమా విజయపథంలో దూసుకెళుతోంది’’ అని అనిల్‌ రావిపూడి పేర్కొన్నారు. ఇంకా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అనిల్‌ రావిపూడి పంచుకున్న విశేషాలు... 

‘మన శంకర వరప్రసాద్‌గారు’ ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్స్‌లో మా సినిమా ఇంకా దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా కోసం చిరంజీవిగారు ప్రత్యేకంగా మేకోవర్‌ అయ్యారు. ఆయనలో ఉన్న ఓ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, ఒకప్పటి ఆయన స్టైల్‌ను ఈ సినిమాలో చూపించాలనుకున్నాను. అన్నీ కుదిరాయి. సక్సెస్‌ టూర్‌లో భాగంగా థియేటర్స్‌ విజిట్‌ చేసినప్పుడు... చిరంజీవిగారిని స్క్రీన్‌పై చక్కగా ప్రజెంట్‌ చేశానని చెప్పారు.

చిరంజీవి, వెంకటేశ్‌గార్ల వంటి స్టార్‌ హీరోలు ఉన్న ఈ సినిమా స్క్రిప్ట్‌ను తక్కువ రోజుల్లోనే పూర్తి చేశాను. కానీ సవాల్‌గా అనిపించింది. కొత్తవారిని ప్రోత్సహించడంలో చిరంజీవిగారు ముందుంటారు. ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌ కోసం ఆట సందీప్‌ను ప్రోత్సహించారు. అలాగే ఈ చిత్రంలోని ‘ఫ్లైయింగ్‌ హై’ పాటను చిరంజీవిగారి చిన్న చెల్లెలు మాధవిగారి కుమార్తె నైరా పాడారు. నైరా ఫిల్మ్‌ కోర్స్‌ చేశారని, సింగర్‌గా ట్రై చేయించమని చిరంజీవిగారు చెప్పారు కానీ, పాట పాడించమని రికమండ్‌ చేయలేదు. అయితే నైరా ఈ పాటను సింగిల్‌ టేక్‌లో పాడారు. 

చిరంజీవి–వెంకటేశ్‌గార్ల కాంబినేషన్‌ సీన్స్‌ని ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఎప్పటికైనా ఓ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ చేస్తాను. ఇక ‘మన శంకర వరప్రసాద్‌గారు’లో ‘మద్యపానం.. మహదానందం’ సీన్స్‌ను ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. విభిన్న రకాలుగా రీల్స్‌ చేస్తున్నారు. అయితే ఈ ‘మధుపానం..’ సీన్స్‌కి సంబంధించిన రీల్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలని కోరుతున్నాను. 

→ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిందీలో రీమేక్‌ అవుతోంది (అక్షయ్‌ కుమార్‌ హీరో). అలాగే ‘భగవంత్‌ కేసరి’ సినిమా కోర్‌ పాయింట్‌తో ‘జన నాయగన్‌’ తీశారు. ఇలా నా డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్‌ కావడం హ్యాపీగా ఉంది. నా సినిమాలను నేరుగా ఇతర భాషల్లోకి రిలీజ్‌ చేయవచ్చు. అయితే ఎమోషన్స్, యాక్షన్‌ యూనివర్సల్‌గా వర్కౌట్‌ అవుతాయి కానీ కామెడీకి మాత్రం ప్రతి భాషకి ఒక ప్రత్యేకమైన టైమింగ్‌ ఉంటుంది కాబట్టి నేరుగా రిలీజ్‌ చేయలేం. 

→ నా తర్వాతి సినిమా కోసం టైటిల్‌ లాక్‌ చేశాను. ఓ విచిత్రమైన జర్నీ స్టార్ట్‌ కాబోతోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికే రిలీజ్‌ చేస్తాను. సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్‌ కావడం ఓ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లా అనిపిస్తోంది. ఇందులో నేను ఓ ముఖ్య పాత్రధారిగా ఉండటం హ్యాపీ. అలాగే వరుస విజయాలతో దర్శకుడిగా వంద శాతం సక్సెస్‌ స్ట్రైక్‌ అనే ఫీలింగ్‌ బాగుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement