
చిరంజీవి హీరోగా రూపొందనున్న తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతారను ఖరారు చేసినట్లు ప్రకటించి, స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నయనతార... తన టీమ్‌తో తెలుగులో మాట్లాడటం, కారు ప్రయాణంలో చిరంజీవి క్లాసిక్‌పాటలు వినడం, ‘హలో మాస్టర్... కెమేరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా’ అని చెప్పడం ఆకట్టుకున్నాయి.
ఫైనల్‌గా అనిల్ రావిపూడి, నయనతార కలిసి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అని చెప్పడంతో ఈ వీడియో ముగిసింది. ‘‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ చిత్రాల తర్వాత చిరంజీవి–నయనతార కలిసి మూడోసారి నటించనున్న చిత్రమిది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. చాలాకాలం తర్వాత చిరంజీవి కంప్లీట్ హ్యూమరస్ రోల్‌లో కనిపించనున్నారు. త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అని యూనిట్ తెలిపింది. 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమేరా: సమీర్ రెడ్డి.
