
∙సాహు, కౌశిక్, అనుపమ, సాయి శ్రీనివాస్, అనిల్, బుచ్చిబాబు, సుస్మిత
‘‘నాకు హారర్ సినిమాలంటే భయం. కానీ, మా నిర్మాత సాహుగారి కోసం ‘కిష్కింధపురి’ చూస్తా’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలి పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్ల పాటి దర్శకత్వంలో సాహు గార పాటి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు సానా, నిర్మాత సుస్మిత కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సాయి శ్రీనివాస్ చాలా కష్టపడతాడు.
తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌కి ఆల్ ది వెరీ బెస్ట్. నిర్మాత సాహుగారితో ‘భగవంత్ కేసరి’ చేశాను. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం చేస్తున్నాను’’ అన్నారు. ‘‘రాక్షసుడు’లానే ‘కిష్కింధపురి’ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు బుచ్చిబాబు. ‘‘కిష్కింధపురి’ ట్రైలర్ అదిరి పోయింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని సుస్మిత కొణిదల. చెప్పారు.