రెండో ఇన్నింగ్స్‌లో చిరంజీవి సినిమాలైతే చేస్తున్నాడు గానీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి సంక్రాంతికి మాత్రం చిరు ఫుల్ జోష్ చూపించాడు. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే రూ.300 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే చిరు.. దర్శకుడు అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
గత పదేళ్ల కాలంలో 9 సినిమాలు చేసిన అనిల్ రావిపూడి.. ప్రతి దానితోనూ సక్సెస్ అందుకున్నాడనే చెప్పొచ్చు. 'ఎఫ్ 3'కి యావరేజ్ టాక్ వచ్చింది. ఇతడి సినిమాల్లో ఉండేది క్రింజ్ కామెడీ అని ట్రోల్స్ వస్తుంటాయి. కానీ ప్రతిసారి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అనిల్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతూనే ఉంది. ఈసారి కూడా అదే ప్రూవ్ అయింది. దీంతో చిరు ఆనందంతో.. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారుని అనిల్‌కి గిఫ్ట్ ఇచ్చారు.
అనిల్ రావిపూడి బహుమతిగా అందుకున్న ఈ కారు ధర హైదరాబాద్ మార్కెట్‌లో దాదాపు రూ.2 కోట్ల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలని నిర్మాణ సంస్థ.. సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్ కాగా, వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. భీమ్స్ అందించిన పాటలు జనాల్ని బాగానే ఎంటర్‌టైన్ చేస్తున్నాయి.
(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌ని అన్‌బ్లాక్ చేసిన హరీష్ శంకర్!)


A MEGA GIFT to the HIT MACHINE 🔥🔥🔥
Moments of Megastar @KChiruTweets garu honouring @AnilRavipudi with a surprising gift, a brand-new Range Rover ❤️🔥#ManaShankaraVaraPrasadGaru THE ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER 💥💥💥 pic.twitter.com/o3C2DvAoL1— Shine Screens (@Shine_Screens) January 25, 2026


