పవన్‌ ఫ్యాన్స్‌ని అన్‌బ్లాక్‌ చేసిన హరీష్‌ శంకర్‌! | Harish Shankar Rebuilds Bond With Pawan Fans Ahead of UBS Release | Sakshi
Sakshi News home page

'బ్లాక్' నుంచి 'అన్‌బ్లాక్'.. పవన్‌ ఫ్యాన్స్‌తో హరీష్‌ ప్రయాణం కొనసాగుతుందా?

Jan 25 2026 5:32 PM | Updated on Jan 25 2026 6:05 PM

Harish Shankar Rebuilds Bond With Pawan Fans Ahead of UBS Release

టాలీవుడ్‌లో సాధారణంగా దర్శకులు, అభిమానుల మధ్య గొడవలు, విమర్శలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. స్టార్‌ హీరో సినిమా ఫ్లాప్‌ అవయితే.. ఫ్యాన్స్‌ అంతా దర్శకుడిని ట్రోల్‌ చేస్తుంటారు. అతన్ని విమర్శిస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కానీ హరీష్‌ శంకర్‌, పవన్‌ ఫ్యాన్స్‌ మధ్య తాజాగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.


గతంలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌పై కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో అతిగా స్పందించి, నెగటివిటీ ప్రచారం చేశారు. దీంతో తన పనికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో హరీష్‌ శంకర్ ఆ అకౌంట్లను బ్లాక్ చేశారు.

అయితే, తాజాగా విడుదలైన సినిమా అప్‌డేట్స్, టీజర్లు చూసిన అభిమానులు హరీష్ శంకర్ విజన్‌పై పూర్తి నమ్మకం పెంచుకున్నారు. దీంతో నిన్న ఒక అభిమాని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తరపున బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. "గతంలో జరిగిన పొరపాట్లను మన్నించి, అందరం కలిసి సినిమాను సెలబ్రేట్ చేసుకునేలా మమ్మల్ని అన్‌బ్లాక్ చేయండి" అని వినమ్రంగా కోరారు.ఈ అభ్యర్థనకు హరీష్ శంకర్ ఎంతో సానుకూలంగా స్పందించారు. 

"గతాన్ని మర్చిపోదాం.. మనమంతా ఒకటే కుటుంబం. సినిమాను కలిసి ఎంజాయ్ చేద్దాం" అంటూ తక్షణమే ఆ అకౌంట్లను అన్‌బ్లాక్ చేశారు.  సినిమా రీలీజ్‌ సమయం దగ్గర పడడంతో హరీశ్‌ అన్‌బ్లాక్‌ చేయడం మొదలు పెట్టాడు. మరి పవన్‌ ఫ్యాన్స్‌, హరీష్‌ల మధ్య ఈ సఖ్యత ఇలానే కొనసాగుతుందా లేదా రిలీజ్‌ వరకే పరిమితం అవుతుందా చూడాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement