
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగాఅనిల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్, క్యాథరిన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్ ముస్సోరిలో, మూడో షెడ్యూల్ కేరళలో పూర్తి చేశారు మేకర్స్. ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్ షెడ్యూల్‌లో చిరంజీవి–నయనతారపాల్గొనగా ఓపాటను చిత్రీకరించారు.
కాగా ఈ సినిమా నాలుగో షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితోపాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపాల్గొంటారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లోనే వెంకటేశ్‌పాల్గొనే అవకాశం ఉందని, చిరంజీవి–వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను అనిల్ రావిపూడి చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాను సుష్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.