breaking news
Kerala schedule
-
జెట్ స్పీడ్‌తో..!
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగాఅనిల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, క్యాథరిన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్ ముస్సోరిలో, మూడో షెడ్యూల్ కేరళలో పూర్తి చేశారు మేకర్స్. ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్ షెడ్యూల్లో చిరంజీవి–నయనతారపాల్గొనగా ఓపాటను చిత్రీకరించారు.కాగా ఈ సినిమా నాలుగో షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితోపాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపాల్గొంటారని తెలిసింది. ఈ షెడ్యూల్లోనే వెంకటేశ్పాల్గొనే అవకాశం ఉందని, చిరంజీవి–వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను అనిల్ రావిపూడి చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాను సుష్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. -
ఐ యామ్ ఫైన్..!
‘‘నాకెలాంటి ప్రమాదం జరగలేదు. అనవసరంగా గాభరా పడొద్దు. నాకు దెబ్బలు తగిలాయని వినిపిస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు’’ అని ఫేస్బుక్ ద్వారా తెలిపారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘బాహుబలి’ షూటింగ్ పనిమీద కేరళలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న షూటింగ్లో ప్రభాస్‌కి తీవ్రమైన గాయాలయ్యాయని ఓ రూమర్ ప్రస్తుతం వెబ్‌సైట్స్‌లో హల్చల్ చేస్తోంది. ప్రభాస్ అభిమానులను, శ్రేయోభిలాషులను భయాందోళనలకు గురిచేసిన రూమర్ ఇది. దాంతో వారిని ఆందోళన చెందవద్దని ఫేస్బుక్ ద్వారా తెలిపారు ప్రభాస్. ‘‘నాకు ఎలాంటి దెబ్బలూ తగలలేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఐయామ్ పర్ఫెక్ట్లీ ఫైన్. నాకు దెబ్బలు తగిలాయి అనగానే.. చాలామంది గందరగోళానికి లోనయ్యారు. నాపై అంతటి ప్రేమని కనబరిచిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ నెల 13న ‘బాహుబలి’ షూటింగ్ కేరళలో మొదలైంది. చాలా ప్రశాంతంగా, కూల్‌గా, సజావుగా షూటింగ్ సాగిపోతోంది. ఎప్పుడెప్పుడు మీ ముందుకొస్తానా... అని ఆత్రుతగా ఉంది’’ అని ప్రభాస్ పేర్కొన్నారు.