నాకెలాంటి ప్రమాదం జరగలేదు. అనవసరంగా గాభరా పడొద్దు. నాకు దెబ్బలు తగిలాయని వినిపిస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు’’ అని ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు ప్రభాస్.
‘‘నాకెలాంటి ప్రమాదం జరగలేదు. అనవసరంగా గాభరా పడొద్దు. నాకు దెబ్బలు తగిలాయని వినిపిస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు’’ అని ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘బాహుబలి’ షూటింగ్ పనిమీద కేరళలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న షూటింగ్‌లో ప్రభాస్‌కి తీవ్రమైన గాయాలయ్యాయని ఓ రూమర్ ప్రస్తుతం వెబ్‌సైట్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రభాస్ అభిమానులను, శ్రేయోభిలాషులను భయాందోళనలకు గురిచేసిన రూమర్ ఇది. 

