'మన శంకర వర ప్రసాద్‌గారు' ఓల్డ్‌ సాంగ్స్‌ ఖర్చు ఎంతో తెలుసా? | Ilaiyaraaja Classic Tunes Add Buzz To Mana Shankara Vara Prasad Gaaru Movie, Know How Much Makers Spend For Rights | Sakshi
Sakshi News home page

'మన శంకర వర ప్రసాద్‌గారు'లో పాత సాంగ్స్‌.. రైట్స్‌ కోసం భారీ ఖర్చు

Jan 13 2026 9:26 AM | Updated on Jan 13 2026 10:03 AM

Mana Shankara Varaprasad Garu Producer Pay Old Songs Rights

ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో 1980 కాలం నాటి పాటలను ఉపయోగిస్తున్నారు. అందులో ఎక్కువగా ఇళయరాజా పాటలు తీసుకోవడం విశేషం. ఈ జనరేషన్  సినీ ఫ్యాన్స్‌కు ఆ సాంగ్స్‌ బాగా నచ్చుతున్నాయి కూడా.. అందుకే దర్శకులు కూడా వాటిపై మక్కువ చూపుతున్నారు. రీసెంట్‌గా కిరణ్‌ అబ్బవరం మూవీ 'కే ర్యాంప్' కోసం హీరో రాజశేఖర్ నటించిన పాత సినిమా పాటను 'ఇదేమిటమ్మ మాయా..' తీసుకున్నారు. సినిమాకు కూడా బాగా కలిసొచ్చింది కూడా.. ఆ సమయంలో నెట్టింట భారీగా వైరల్‌ అయింది. అయతే, సంక్రాంతి రేసులో ఉన్న 'మన శంకర వర ప్రసాద్‌గారు'  సినిమాలో కూడా పాత పాటలను ఉపయోగించి క్రేజ్‌ తెచ్చారు.

చిరంజీవి- అనిల్‌ రావిపూడి సినిమా 'మన శంకర వర ప్రసాద్‌గారు'లో సంగీత దర్శకులు ఇళయరాజా స్వరపరిచిన రజనీకాంత్ 'దళపతి' చిత్రంలోని 'సుందరి కన్నల్ ఒరు సేథి' అనే ఐకానిక్ పాటను పదే పదే  ఉపయోగించారు. హీరో, హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ కోసం ఈ సాంగ్‌ను మూడు భాషల నుంచి తీసుకున్నారు. 'దళపతి' సినిమా తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళంలో కూడా విడుదలైంది. అయితే, చిరు సినిమా కోసం అన్ని భాషలకు సంబంధించిన ట్యూన్‌ హక్కులను తీసుకున్నట్లు తెలుస్తోంది.  

ఆపై  సినిమాలో అక్కడక్కడ మరికొన్ని పాత పాటలను దర్శకుడు వాడారు.  దీంతో ఈ పాటల రైట్స్‌ కోసం అడియో కంపెనీలకు భారీగానే డబ్బు చెల్లించినట్లు తెలుస్తోంది. మన శంకర వర ప్రసాద్‌గారులో ఉపయోగించిన పాత పాటల అన్నింటికి కలిపి సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. అది కూడా కేవలం ట్యూన్స్‌ వరకు మాత్రమే అనుమతి తీసుకున్నట్లు టాక్‌.. అయితే, 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాకు ఆ పాత పాటలకు బాగా ఉపయోగపడ్డాయి. ఆ ట్యూన్‌ వచ్చిన ప్రతిసారి ఫ్యాన్స్‌ విజిల్స్‌ వేస్తూ ఎంజాయ్‌ చేశారు. చిరంజీవి పాట 'రామ్మా చిలకమ్మ'కు వెంకీ డ్యాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు చేసిన గోల మామూలుగా ఉండదు. ఆపై 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పాటకు చిరు స్టెప్పులు వేసి ప్రేక్షకుల్లో జోష్‌ నింపారు. ఇలా అన్ని పాటలకు కోటి రూపాయలు ఖర్చు చేసినప్పటికీ మూవీ లవర్స్‌ మాత్రం బాగా ఎంజాయ్‌ చేశారని చెప్పొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement