నన్ను లాక్కెళ్లి ముద్దు పెట్టాలని చూశారు: అనిల్‌ రావిపూడి | Anil Ravipudi Speech at Mana Shankara Vara Prasad Garu Movie Thank You Meet | Sakshi
Sakshi News home page

కారు కొనిస్తా.. నాకు ఫామ్‌హౌస్‌ కొనివ్వాలి: అనిల్‌ రావిపూడి కండీషన్‌

Jan 14 2026 12:25 PM | Updated on Jan 14 2026 12:35 PM

Anil Ravipudi Speech at Mana Shankara Vara Prasad Garu Movie Thank You Meet

వరుస విజయాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అందులోనూ హిట్లు, సూపర్‌ హిట్లు, బ్లాక్‌బస్టర్లు కొల్లగొట్టడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ అవన్నీ నాకు కొట్టిన పిండి అంటున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి.. ఒకటీరెండు కాదు వరుసగా తొమ్మిది విజయాలను అందుకుని హిట్‌ మెషిన్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు.

మెగా బ్లాక్‌బస్టర్‌ 
అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం మన శంకరవరప్రసాద్‌ గారు. నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్రలో కనిపించాడు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మెగా బ్లాక్‌బస్టర్‌ థాంక్యూ మీట్‌లో అనిల్‌ రావిపూడి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

కనబడితే లాక్కెళ్లి..
ఆయన మాట్లాడుతూ.. ఈ కథలోని అన్ని సన్నివేశాలకు చిరంజీవి గారే స్ఫూర్తి. నాకు ఈ సినిమా చేసే అవకాశాన్నిచ్చిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు. మెగా ఫ్యాన్స్‌ అయితే నేను కనబడితే లాక్కెళ్లి ముద్దులు పెడదామని చూస్తున్నారు. వాళ్లు చూపిస్తున్న అభిమానాన్ని మర్చిపోలేను.

ఫామ్‌హౌస్‌ కొనివ్వాలి
అమెరికాలో ప్రీమియర్స్‌ 1 మిలియన్‌ డాలర్‌ వసూలు చేస్తే నిర్మాత సాహు గారపాటికి కారు ఇస్తానన్నాను. నేను అనుకున్న నెంబర్‌ దాటిపోయింది కాబట్టి ఆయనకు కారు కొనిస్తాను. కాకపోతే.. కలెక్షన్స్‌ మూడు దాటి నాలుగు మిలియన్‌ డాలర్లు వస్తే నాకు ఫామ్‌ హౌస్‌ కొనివ్వాలి. ఇప్పుడు ఆయన కారు అడుగుతారా? లేదా? అనేది ఆయన ఇష్టం అని అనిల్‌ రావిపూడి సరదాగా ఓ కండీషన్‌ పెట్టాడు.

చదవండి: మన శంకరవరప్రసాద్‌ గారు రెండు రోజుల కలెక్షన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement