breaking news
Sahu Garapati
-
హీరో లేడీ గెటప్ వేస్తే హిట్టే: నిర్మాత సాహు గారపాటి
‘‘హీరో లేడీ గెటప్ వేసిన ‘భామనే సత్యభామనే, మేడమ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించి, హిట్స్‌గా నిలిచాయి. ఈ సెంటిమెంట్‌తో ‘లైలా’(Laila) మూవీ కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే తెలుగులో ఈ తరహా సినిమాలు వచ్చి కూడా చాలా కాలం అయింది. దీంతో ‘లైలా’ మూవీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు నిర్మాత సాహు గారపాటి. విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. ఆకాంక్షా శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో కామాక్షీ భాస్కర్ల, అభిమన్యు సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో నిర్మాత సాహు గారపాటి(Producer Sahu Garapati) మాట్లాడుతూ– ‘‘యూత్ టార్గెట్‌గా చేసిన ‘లైలా’ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో హీరో లేడీ క్యారెక్టర్ (లైలా) కూడా చేశారు. ఈ క్యారెక్టర్ కోసం ముందుగా కొందరు హీరోలను అనుకున్నాం. విశ్వక్ ఈ కథ వినగానే ‘ఇది నేను చేయాల్సిన క్యారెక్టర్’ అన్నారు.హీరో తొలి భాగం సోనూగా, రెండో భాగం లైలాగా మారతాడు. లైలాగా హీరో ఎందుకు మారాడు? అనేది ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ప్రస్తుతం నిర్మాత పరిస్థితి ఏమీ బాగోలేదు. అనుకున్న బడ్జెట్లో సినిమాను నిర్మించగలిగితే ఓకే. ‘లైలా’ని అనుకున్న బడ్జెట్లోనే తీశాం. చిరంజీవిగారితో అనిల్ రావిపూడి డైరెక్షన్లో మేం చేయనున్న నెక్ట్స్ మూవీ జూన్ లేదా జూలైలో ప్రారంభం అవుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది’’ అని అన్నారు. -
సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్‌కి మరో కారు గిఫ్ట్
సినిమా హిట్ అయితే ఆ ఆనందంలో నిర్మాతలు.. సదరు హీరో, దర్శకులకు బహుమతులు ఇవ్వడం సాధారణమైన విషయం. అయితే మూవీ రిలీజైన ఏడాది దాటిపోయిన తర్వాత కూడా కారు బహుమతిగా ఇచ్చే నిర్మాతలు ఉంటారా? అంటే టాలీవుడ్లో ఉన్నారనిపిస్తోంది. ఆయనే సాహు గారపాటి. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడికి మరో కారు గిఫ్ట్‌గా ఇచ్చారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!)అనిల్ రావిపూడి గత సినిమా 'భగవంత్ కేసరి'. గతేడాది దసరాకు రిలీజైంది. మరీ అద్భుతం కానప్పటికీ ఓ మాదిరిగా ఆడింది. ఇందులో బాలయ్య-శ్రీలీల.. తండ్రి కూతురు పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అప్పట్లోనే నిర్మాత సాహు గారపాటి.. అనిల్‌కి టయోటా వెల్ఫైర్ కారు బహుమతిగా ఇచ్చారు.తాజాగా ఇప్పుడు మళ్లీ అదే మోడల్ మరో కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మార్కెట్లో ఈ కారు ధర కోటిన్నర రూపాయలు పైనే. ఇకపోతే అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్‌తో సినిమా చేస్తున్నాడు. దీనికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ అనుకుంటున్నారు. పేరుకి తగ్గట్టే ఇది సంక్రాంతి పండగకి రిలీజ్ అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓవైపు విడాకుల రూమర్స్.. 10 ఫ్లాట్స్ కొన్న బచ్చన్ ఫ్యామిలీ) -
Tuck Jagadish: ఆ పరిస్థితి లేదు.. అందుకే ఓటీటీకి వెళ్లాం
థియేటర్ కోసమే టక్‌జగదీష్ సినిమాను ప్లాన్ చేశాం. ఏప్రిల్‌లో విడుదల చేద్దామంటే కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. త్వరలోనే థర్డ్ వేవ్ అంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితిలో సినిమాను జనాలకు వరకు తీసుకొస్తామా? లేదా? ఇంకెప్పుడు చూపిస్తామని అందరం కలిసి ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం’అన్నారు నిర్మాత సాహు గారపాటి. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం.సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా నిర్మాత సాహు గారపాటి మీడియాతో ముచ్చటించారు. ►మజిలీ తరువాత ఈ చిత్రం మొదలైంది. మజిలీ సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే ఎమోషన్స్ తీశాం. ఇంకాస్త పెద్ద స్కేల్లో ఎమోషన్స్ ఉండాలని అనుకున్నాం. శివ గారు టక్ జగదీష్ కథ చెప్పారు. ఈ కథకు మంచి యాక్టర్ కావాలని అనుకున్నాం.. అప్పుడు మాకు నాని గుర్తుకు వచ్చారు. మా బ్యానర్ ప్రారంభమైంది కూడా ఆయనతోనే. ఆయనకు టక్ జగదీష్ కథ చెప్పాం.. నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. ఇప్పటి వరకు ఆయన పోషించని పాత్ర ఇది. ► ప్రతీ ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలని అనుకునేలా టక్ జగదీష్ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్ మీదే ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలు తక్కువయ్యాయి. అందుకే మేం ఇలాంటి కథతో వచ్చాం. ప్రేక్షకులందరూ మంచి సినిమా చూశామని అనుకుంటారు. సినిమా నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు. ద్వితీయార్థం మొత్తం కూడా ఎమోషన్స్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ►ఇది ఫ్యామిలీ ఎమోషన్ సినిమా. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కానీ అది చాలా తక్కువ. అక్కా తమ్ముడు, అమ్మ కొడుకు ఇలా అందరి మధ్య ఎమోషన్స్ ఉంటుంది. కంటెంట్ ఎక్కడా దారి తప్పకుండా ఉండేందుకు ఎంటర్టైన్మెంట్ అంతగా జొప్పించలేదు. కానీ కథకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ►ఇది భారీ బడ్జెట్ చిత్రం. ఈ లెక్కన అన్ని చోట్లా థియేటర్లు తెరిచి ఉండాలి. కానీ పరిస్థితులు అలా లేనందుకే ఓటీటీకి వెళ్లాం. ఎస్ఆర్ కళ్యాణ మండపం రిజల్ట్ వల్ల మా అభిప్రాయం మారలేదు. ఆగస్ట్‌లో మేం థియేటర్‌కు రావాలని అనుకున్నాం. కానీ పరిస్థితులు చక్కబడే అవకాశం ఉన్నట్టు మాకు కనిపించలేదు. అందుకే ఓటీటీ నిర్ణయాన్ని తీసుకున్నాం. ► హీరోలైనా, నిర్మాతలైనా ఎవ్వరైనా సరే.. సినిమాను జనాలకు చూపించాలనే అనుకుంటారు. ఇది జనాలకు పండుగ నాడు చూపించాల్సిన సినిమా. ►ప్రస్తుతం ఎక్కడా కూడా పరిస్థితులు చక్కబడలేదు. మన పక్క రాష్ట్రాల్లో కూడా ఇంకా అంతగా థియేటర్లు తెరవలేదు. విదేశాల్లోనూ పరిస్థితులు అలానే ఉన్నాయి. అందుకే ఎక్కువ మందికి ఈ సినిమాను రీచ్ అయ్యేలా చేసేందుకు ఓటీటీకి ఇవ్వాల్సి వచ్చింది. ►రెండు మూడు నెలల్లో అన్ని పరిస్థితులు చక్కబడతాయనే నమ్మకం, ఆశ ఉంది. ఆ నమ్మకం ఉంటేనే బతకగలుగుతాం. మిగతా సినిమాలను కూడా రెడీ చేస్తున్నాం. ►అందరు హీరోలతో కలిసి పని చేయాలని అనుకుంటాం. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అని కాకుండా అందరితో చేయాలని అనుకుంటాం. అనిల్ రావిపూడి బాలయ్య ప్రాజెక్ట్‌ను దసరాకు ప్రకటిస్తాం. నాగ చైతన్యతో కూడా ఓ సినిమా ఉంది. విజయ్ దేవరకొండ బిజీగా ఉండటంతో సినిమా కుదరడం లేదు ఇంకా కొంచెం సమయం పడుతుంది. ►బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ చేయాల్సిందే. కానీ శివ, గోపీ సుందర్ మధ్య మంచి ర్యాపో ఉంది. మజిలీ, నిన్ను కోరి సినిమాలకు గోపీ సుందర్ సంగీతం అందించారు. కాబట్టి గోపీ సుందర్ నుంచి ఇంకా బాగా తీసుకోగలను అనే నమ్మకంతో శివ నిర్వాణ ఉన్నారు. అందుకే అంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాలు చూడడానికి వేరే కొత్త మీడియమ్స్ వచ్చాయి. థియేటర్లు కూడా ఉంటాయి. మా ప్రయార్టీ ఎప్పుడూ కూడా థియేటర్లే.