మనశంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో తాజాగా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. చిత్ర యూనిట్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఈ వేడుకలో పాల్గొన్నారు. రెండువారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 350 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలుగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విజయం అందుకున్నారని చిరు పేర్కొన్నారు. ఈ క్రమంలో తన కూతురు సుస్మిత ఒక నిర్మాతగా పడిన కష్టం గురించి చిరు పలు విషయాలను పంచుకున్నారు.
సుస్మిత గురించి చిరంజీవి ఇలా అన్నారు. 'చరణ్ వద్ద సలహా తీసుకున్న తర్వాతే సుస్మిత ఇండస్ట్రీలోకి వచ్చింది. రంగస్థలం మూవీ కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ఆమె ఒక నిర్మాతగా మరో అడుగు ముందుకు వేసింది. సుస్మిత అనుకుంటే ఇంట్లో ఉన్న హీరోలతో సినిమాలు చేయవచ్చు. కానీ, ఆమె మొదట వెబ్ సీరిస్‌లను నిర్మించి నిర్మాతగా పలు విషయాలను తెలుసుకుంది. ఆ తర్వాతే మరో నిర్మాత సాహు గారపాటితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ ప్రయాణంలో ఆమెకు నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
నిర్మాతలుగా వారిద్దరే చెరో సగం పెట్టుబడి పెట్టారు. డబ్బు అవసరం అయితే అప్పుగా తెచ్చుకుంది కానీ నన్ను ఎన్నడూ అడగలేదు. పలు దపాలుగా నా రెమ్యునరేషన్ కూడా సమయానికి ఇచ్చేశారు. కూతురుగా కాకుండా ఒక నిర్మాతగా చాలా ప్రొఫెషనల్‌గా సుస్మిత పనిచేసింది. ఈ మూవీకి చాలా డబ్బు పెట్టుబడి పెట్టి ఆమె విజయం సాధించడంతో ఒక తండ్రిగా నేను సంతోషిస్తున్నాను.' అని చిరు అన్నారు. ఆపై ‘మనశంకర వరప్రసాద్ గారు’ మూవీ గురించి మరిన్ని విషయాలను చిరు పంచుకున్నారు. పూర్తి వీడియోలో చూడండి.


