
అనిల్ రావిపూడి (Anil Ravipudi) అంటేనే హాస్యానికి, విజయానికి చిరునామా. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మామూలు సక్సెస్ అందుకోలేదు. ఎవరూ ఊహించనంతగా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాడు. ఈ సంతోషంలో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్నామని మాటిచ్చేశాడు. కాకపోతే ఈసారి వెంకీమామతో కాదు.. చిరంజీవి (Chiranjeevi Konidela)తో! ఇందుకోసం వైజాగ్ వెళ్లి సినిమా కథ సిద్ధం చేసుకున్నాడు.
కథకు పచ్చజెండా ఊపిన చిరు
గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్‌లో చిరంజీవిని చూస్తారని అభిమానులకు మాటిచ్చాడు. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమా అప్‌డేట్ ఇచ్చాడు. 'కథ పూర్తయింది. చిరంజీవిగారికి ఫైనల్ స్క్రిప్ట్ చదివి వినిపించాను. నా కథలోని శంకర్ వరప్రసాద్ పాత్రను పరిచయం చేశాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇంకెందుకు లేటు.. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకు శ్రీకారం చుట్టేద్దాం' అని ఎక్స్(ట్విటర్)లో ట్వీట్ చేశాడు.

చిరంజీవి ఒరిజినల్ పేరుతో..
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఈ సినిమా నిర్మితం కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. ఇది చూసిన అభిమానులు ఉగాదికి ముందు ఎంత మంచి శుభవార్త చెప్పారు.. ఇంకో బ్లాక్‌బస్టర్ తథ్యం అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఇందులో శివ అనే పదాన్ని తీసేసి మిగతాది యథాతథంగా వాడేశారు. మెగాస్టార్ అసలు పేరును వాడేస్తున్న అనిల్ రావిపూడి సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే వచ్చే సంక్రాంతిదాకా ఆగాల్సిందే!
Final script narration done & locked 📝☑️🔒
చిరంజీవి గారికి నా కధ లో పాత్ర
“శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను .. 😄
He loved & enjoyed it thoroughly ❤️🔥
ఇంకెందుకు లేటు,
త్వరలో ముహూర్తంతో…
‘చిరు’ నవ్వుల పండగబొమ్మ కి శ్రీకారం 🥳#ChiruAnil
MegaStar @KChiruTweets garu…— Anil Ravipudi (@AnilRavipudi) March 26, 2025
చదవండి: అర్ధరాత్రి ఫోన్.. నన్ను తీసేసి ఓ శునకాన్ని పెట్టుకున్నారు.. శోభిత హర్ట్