
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగన ముద్ర వేసిన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. ఈ చిత్రంలో వెంకటేశ్ సతీమణిగా నటించి అభిమానులను అలరించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైంది.
ఈ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీలో తన రోల్ గురించి మాట్లాడింది. పిల్లలకు తల్లి పాత్రలో చేయడం అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. మంచి నటిగా రాణించాలంటే ఎలాంటి పాత్రనైనా చేయాల్సిందేనని.. ఇలాంటి పాత్రలు చేయడానికి వయస్సు అడ్డంకి కాదని వెల్లడించింది. నేను చాలా సినిమాల్లో తల్లిగానే నటించానని పేర్కొంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో నలుగురు పిల్లలకు అమ్మగా నటించానని ఐశ్వర్య రాజేశ్ తెలిపింది. ఒకవేళ సంక్రాంతికి వస్తున్నాం-2 మూవీ చేస్తే కనుక నాకు ఆరుగురు పిల్లలు ఉంటారని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారని తానా సభలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.