రమణ గోగుల సాంగ్‌ అందుకే పెట్టలేదు: అనిల్‌ రావిపూడి | Anil Ravipudi Reveals Reason Why Ramana Gogula Song Removed | Sakshi
Sakshi News home page

Anil Ravipudi: మెగాస్టార్‌ మూవీలో రమణ సాంగ్‌.. అందుకే తీసేశా!

Jan 26 2026 12:07 PM | Updated on Jan 26 2026 1:07 PM

Anil Ravipudi Reveals Reason Why Ramana Gogula Song Removed

ఒకప్పుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా, సింగర్‌గా రాణించిన రమణ గోగుల తర్వాత సడన్‌గా సినిమాలకు దూరమయ్యాడు. గతేడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సింగర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో ఆయన పాడిన గోదారి గట్టు మీద రామసిలకవే.. పాట బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో మార్మోగిపోయింది.

రమణతో సాంగ్‌
దీంతో అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రమణ గోగుల మరో పాట పాడబోతున్నాడని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అది ఏ సినిమాకో కాదు.. చిరంజీవి హీరోగా నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీకి! భీమ్స్‌ ఇచ్చిన ట్యూన్‌కు అతడితో పాట కూడా పాడించారట.. ఇంకేముంది, ఈ సాంగ్‌ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. తీరా సినిమాలో ఆయన పాడిన పాటే లేదు. ఈ విషయంపై తాజాగా అనిల్‌ రావిపూడి స్పందించాడు. 

అంత ఊపు లేదని..
ఆయన మాట్లాడుతూ.. రమణ గోగులతో ఓ పాట పాడించాను. కాకపోతే అది మెలోడియస్‌గా ఉందని పక్కన పెట్టాల్సి వచ్చింది. సినిమాలో మొదటి పాట అంటే ఎనర్జీ, ఊపు, వైబ్‌ ఉండాలి. కానీ రమణ పాడిన పాట మెలోడియస్‌గా డ్యుయెట్‌లా ఉంది.  ఓపెనింగ్‌ సాంగే ఊపు రావాలి.. కానీ ఇదంత జోష్‌గా లేదని నాకెక్కడో కొడుతూనే ఉంది. దీంతో ఆయనకు చెప్పి ఆ పాటను పక్కనపెట్టాం. దాని స్థానంలో హుక్‌ స్టెప్‌ సాంగ్‌ పెట్టాం. రమణ పాడిన సాంగ్‌ రిలీజ్‌ చేయాలనుకోవడం లేదు. అది ఇంకో సినిమాలో వాడుకుంటాను అని చెప్పుకొచ్చాడు.

సింగర్‌ మాత్రమే కాదు
సింగర్‌ రమణ గోగుల ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు మాత్రమే కాదు. వీటన్నింటికన్నా ముందు ఆయన ఓ వ్యాపారవేత్త. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సోలార్‌ ఎనర్జీ, అమెరికాలోని లూసియానా యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చదివాడు. తర్వాత పలు స్టార్టప్‌ కంపెనీలను ప్రారంభించాడు. ఎన్నో వందలాది గ్రామాలకు సోలార్‌ ఎల్‌డీ కాంతులు అందించాడు.

చదవండి: పనిమనిషిపై 10 ఏళ్లుగా అత్యాచారం, ధురంధర్‌ నటుడి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement