శ్రీశైలానికి భక్తుల పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలానికి భక్తుల పాదయాత్ర

Mar 8 2026 7:54 AM | Updated on Mar 8 2026 7:54 AM

రాయచూరు రూరల్‌: ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక భక్తులు శ్రీశైలానికి పాదయాత్ర ప్రారంభించారు. బాగల్‌ కోట, బీజాపూర్‌, జమఖండి, గదగ్‌, దారవాడ, హునగుంద, ఇలకల్‌ భక్త సముహం వివిధ మార్గాల్లో మార్చి 5 నుంచి 18వ తేదీ వరకూ 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగిస్తారు. బాగల్‌కోట నుంచి శ్రీశైలం 650 కి.మీ దూరంలో ఉంది. రోజు తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమైన పాదయ్రాతలు.. ఉదయం 11 గంటల వరకూ కొనసాగుతుంది. మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. బాగల్‌ కోట జిల్లా అమీన్‌గడ్‌ నుంచి నర్మద, ఇలకల్‌ నాగరాజ్‌ కాళ్లకు కర్రలు కట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న తీరు ఆకట్టుకుంటోంది.

కేహెచ్‌ మునియప్ప

సేవలు ఆదర్శం

సాక్షి బళ్లారి: కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్‌ మునియప్ప సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని లిడ్కర్‌ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ముండ్రిగి నాగరాజు కొనియాడారు. శనివారం కేహెచ్‌ మునియప్ప జన్మదినం పురస్కరించుకుని నగర శివారులోని ఆదర్శ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, పండ్లు, బ్రెడ్డు, దుస్తులు పంపిణీ చేశారు. దళిత సమాజంలో జన్మించిన మునియప్ప అంచెలంచెలుగా ఎదిగారన్నారు. కేహెచ్‌ మునియప్ప సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను వృద్ధాశ్రమంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎల్‌.మారెణ్ణ, గ్యారంటీ ప్రాధికార జిల్లాధ్యక్షుడు చిదానందప్ప, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వైద్య శిబిరాలతో

పేదలకు మేలు

రాయచూరు రూరల్‌: జిల్లాలో వివిధ రకాల వ్యాధులకు అందించే చికిత్సలపై ప్రచారం చేపట్టాలి. పేదలు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నగర సభ కమిషనర్‌ జుబీన్‌ మహపాత్రో పిలుపునిచ్చారు. శనివారం సంతోష్‌ హోంటెల్‌లో శిల్పా మెడికేర్‌, కొప్పళ్‌ అగస్య్త ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరికి వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. కీళ్లనొప్పి, తల నొిప్పి, సంది వాతం, కిడ్ని వ్యాధులకు చికిత్సలు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శిల్పా మెడికేర్‌ ఎండీ విష్ణు కాంత బూటాడే, కొప్పళ అగస్‌త్త్యాయుర్వేద కళాశాల అధికారి లోకేష్‌ టెల్‌, గౌతం, రమేష్‌ భూబ్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

తాలూకా కేంద్రంగా

ప్రకటించాలి

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లా మాన్వి తాలూకా నుంచి కవితాళను వేరు చేసి తాలూకా కేంద్రంగా ప్రకటించాలని అభినవ సిద్ధలింగ మహస్వామి సూచించారు. శనివారం అమీన్‌గడ్‌ వటగల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 కి.మీ దూరమున్న సిరవారను తాలూకా కేంద్రంగా ప్రకటించి మూడేళ్లు అవుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కవితాళను తాలుకా కేంద్రంగా ప్రకటించక పోవడం సరికాదన్నారు. ఈ విషయంలో శాసన సభ్యులు హంపయ్య నాయక్‌, బసనగౌడ విఫలమయ్యారని మండిపడ్డారు. కవితాళ పరిధిలోకి సుమారు 45 గ్రామాలు వస్తాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement