మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్: సజ్జల | Sajjala Ramakrishna Reddy Says YS Jagan Brings Historical Reforms For Women In Just Five Years, Fires On CBN Govt | Sakshi
Sakshi News home page

మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్: సజ్జల

Mar 8 2026 3:09 PM | Updated on Mar 8 2026 5:03 PM

Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని.. ఐదేళ్లలోనే యాభై ఏళ్ల సంస్కరణలు తెచ్చారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో​‍-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉమెన్స్ డే వేడుకల్లో మాట్లాడుతూ.. పార్టీలో మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అన్నిఅనుబంధ విభాగాల్లోనూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సజ్జల అన్నారు.

‘‘మండల, గ్రామస్థాయిలో కమిటీలను పూర్తి చేయాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో మహిళా విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. ఏదైనా సమస్యలపై గట్టిగా పోరాటం చేయవచ్చు. స్థానికంగా ఉన్న సమస్యలపై అక్కడే పోరాటం చేయాలి. పార్టీ పిలుపునిచ్చే రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. మీ దృష్టికి వచ్చిన సమస్యలను స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. లీడర్లుగా ఎదగాలంటే చొరవ చూపి ముందుకు నడవాలి. చంద్రబాబు మహిళలకు అన్యాయం చేశారు. ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారు.

..వైఎస్ జగన్ అనేక పథకాలను మహిళలే కేంద్రంగా అమలు చేశారు. మహిళల జీవన ప్రమాణాలను పెంచేలా కృషి చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. దీని వలన జరుగుతున్న నష్టాలపై ఎక్కడికక్కడే సమావేశాలు పెట్టాలి. అందరిలోనూ చైతన్యం తీసుకు రావాలి. వచ్చే ఎన్నికల నాటికి మహిళలే కీలక పాత్ర పోషించేలా నాయకత్వం వహించాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement