దేవుడితో రాజకీయాలా?
శ్రీవారి భక్తురాలిగా గత 30 ఏళ్ల నుంచి తిరుమలకు తరచూ వెళ్తున్నా. ప లుసార్లు మొక్కులు తీర్చుకునేందుకు కాలినడక సై తం వెళ్లా. శ్రీవారి లడ్డూ ప్ర సాదానికి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిపారని ప్రచారం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సైతం ఈ విషయంపై బహిరంగంగా ప్రకటించారు. విచారణ చేపట్టకముందే ఇలా వదంతులు రావడం బాధేసింది. ప్రస్తుతం సీబీఐ నివేదికతో అసలు విషయం తేలిపోయింది.
–సుభద్రమ్మ, భక్తురాలు, తిరుపతి రూరల్
అసలు విషయం తేలిపోయింది
శ్రీవారి లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతు కొ వ్వు కలిసిందనే విషయంపై ప్రభుత్వం నానా రా ద్ధాంతం చేసింది. రాజకీయాలకు టీటీడీని వేదిక చే సుకోవడం మంచిది కాదు. గత ప్రభుత్వ హయాంలో నెయ్యిలో కల్తీ జరిగిందని బాబు సర్కారు సిట్ ను నియమించి విచారణ చేపట్టింది. కానీ సీబీఐ విచారణలో జంతు కొవ్వు కలవలేదని నివేదిక సమ ర్పించింది. –రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతి
దేవుడితో రాజకీయాలా?


