పట్టపగలే రెండిళ్లలో చోరీ | - | Sakshi
Sakshi News home page

పట్టపగలే రెండిళ్లలో చోరీ

Jan 30 2026 6:39 AM | Updated on Jan 30 2026 6:39 AM

పట్టపగలే రెండిళ్లలో చోరీ

పట్టపగలే రెండిళ్లలో చోరీ

– 8లో

అయ్యవారిపాళెంలో పట్టపగలే రెండిళ్లలో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కూటమి అపచారానికి

పరిహార హోమం

తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా క చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన అసత్య ప్రచారానికి శుక్రవారం తిరుపతిలో ఉదయం 10 గంటలకు శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం నిర్వహించనున్నట్లు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్షతో వైఎస్సార్‌సీపీపై బురదజల్లాలన్న దురాలోచనతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనే నీచ రాజకీయాలు చేసి లడ్డూలో ఆవు, పంది కొవ్వు కలిపామంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ దుష్ప్రాచారం చేశా రని మండిపడ్డారు. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి సీబీఐతో విచారణ జరిపించాలని కోరినట్టు వెల్లడించారు. ఆ దర్యాప్తులో శ్రీవారి లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదని తుది నివేదికలో తేల్చిచెప్పిందన్నారు. దాంతో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు వైఎస్సార్‌సీపీపై మోపిన నింద సీబీఐ నివేదికతో పటాపంచలయ్యిందన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ చేసిన పాపాలకు తిరుపతిలో పరిహార హోమం నిర్వహించనున్నట్లు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement