హిందువులుగా పుట్టినవాళ్లం హిందువుగానే పోవాలన్నదే మా కోరిక | - | Sakshi
Sakshi News home page

హిందువులుగా పుట్టినవాళ్లం హిందువుగానే పోవాలన్నదే మా కోరిక

Apr 3 2026 8:02 AM | Updated on Apr 3 2026 8:02 AM

● 27ఏళ్లుగా కువైట్‌లో ముస్లింలుగా ఉన్న అబ్దుల్లా, అమ్మీనాలు ● ముస్లింలను హిందూమతంలోకి మార్పిడి ● శ్రీనివాసులు, పుష్పలుగా నామకరణం ● వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టానన్న భూమన

● 27ఏళ్లుగా కువైట్‌లో ముస్లింలుగా ఉన్న అబ్దుల్లా, అమ్మీనాలు ● ముస్లింలను హిందూమతంలోకి మార్పిడి ● శ్రీనివాసులు, పుష్పలుగా నామకరణం ● వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టానన్న భూమన

తిరుపతి మంగళం : ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన తాము అనివార్యకారణాలతో ముస్లిం మతం స్వీకరించాం.. తిరిగి పురిటిగడ్డకు చేరిన తమను మళ్లీ హిందూమతం స్వీకరిస్తున్నామని, హిందూమతం మా అభిమతం అని అబ్దుల్లా, అమ్మీనా ఉద్ఘాటించా రు. హిందుమతంలో పుట్టి అనివార్య కారణాలతో 27ఏళ్ల పాటు కువైట్‌లో ముస్లిం మతాన్ని స్వీకరించా ల్సి వచ్చిందని అబ్దుల్లా, అమ్మీనాలు తెలిపారు. హిందువులుగా పుట్టిన వాళ్లం హిందువులుగానే పోవాలన్నదే మా అభిమతమని, అయితే ఆ కోరికను టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి సాక్ష్యాత్తు వేంకటేశ్వరస్వామి రూపంలో వచ్చి, తమని తిరిగి హిందూమతంలోకి మారాలని కోరారన్నారు. దాంతో తిరుపతి పద్మావతిపురంలోని భూమన నివాసం వద్ద గురువారం వేదపండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ హోమం నిర్వహించి, తిరిగి హిందూమతంలో చేరడం ఎంతో సంతోషిస్తున్నామని హిందూమతంలో చేరిన శ్రీనివాసులు, పుష్ప తెలిపారు. అందుకు అవసరమైన వేదమంత్రోచ్ఛారణల నడుమ హోమాలు నిర్వహించి, హిందూమతంలోకి మార్పించి గతంలో తమకున్న పేర్లు శ్రీనివాసులు, పుష్పగా భూమన కరుణాకరరెడ్డి తిరిగి నామకరణం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వేంకటేశ్వరస్వామివారికి మొక్కులు చెల్లించి రుణం తీర్చుకోవచ్చు. కానీ మాకు తిరిగి హిందూమతాన్ని ప్రసాదించిన భూమన కరుణాకరరెడ్డికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమంటూ ఆనందం వ్యక్తం చేశారు. హిందుత్వం అన్న ముసుగు వేసుకుని కొందరు ఎన్నో చెబుతుంటారని, అయితే హిందువుగా హిందుత్వంపై అపారమైన నమ్మకాన్ని పెంచుకున్న నిజమైన హిందూవాది భూమన కరుణాకరరెడ్డి అన్నారు.

శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే..

తిరుపతికి చెందిన శ్రీనివాసులు, పుష్ప దంపతులు కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడే 27 ఏళ్ల పాటు ముస్లిం మతాన్ని స్వీ కరించి ముస్లింలుగా ఉన్నారు. శ్రీనివాసులు తన పే రును అబ్దుల్లాగా, అలాగే ఆయన భార్య పుష్ప తన పే రును అమ్మినాగా మార్చుకున్నారు. ముస్లిం పేర్లతోనే అన్ని రకాల కార్డులను సృష్టించుకున్నారు. 2015లో వారు ఇండియాకు తిరిగొచ్చారు. తిరుపతి పెద్దకాపు వీధిలో అబ్దుల్లా కుటుంబం నివాసం ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న భూమన కరుణాకరరెడ్డి అబ్దు ల్లా ఇంటికి వెళ్లారు. పలుమార్లు చర్చించారు. హిందూ మత విశిష్టను వారికి వివరించారు. దీంతో భూమన నేతృత్వంలో హిందూమతం స్వీకరించేందుకు అబ్దు ల్లా, ఆయన భార్య అమ్మినా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో హిందూ మత పునఃస్వీకరణ మహోత్సవానికి భూమన శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అబ్దుల్లా, అమ్మినాలను హిందూమతంలోకి తిరిగి తీసుకొచ్చారు. తిరిగి వారికి శ్రీనివాసులు, పుష్పగా నామకరణం చేశారు.

వెంకన్నే ఈ అవకాశం కల్పించారు!

గతంలో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి తిరుమల ఆస్థాన మండపంలో 90 మంది పీఠాధిపతులు, మఠాధిపతుల నేతృత్వంలో నిర్వహించిన వేద విద్వత్‌ సదస్సు లో ఇతర మతాల నుంచి హిందూ మతంలో చేరేవారికి తిరుమల వేదికగా హిందూమత స్వీకరణ కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు. హిందూ మత స్వీకరణకు తిరుమ ల శ్రీవారిని దిక్సూచిగా చేయాలని భూమన ఆధ్వర్యంలో నాడు నిర్ణయించారు. ఇది ఆ చరణలోకి రాకముందే వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత అధికారంలో కి వచ్చిన కూటమి ప్రభుత్వం దీన్ని ఆచరణలోకి తీసుకురాలేదు. కాబట్టే సాక్ష్యాత్తు వేంకటేశ్వరస్వామి ఈ బృహత్తర మతమార్పిడి కార్యక్రమాన్ని తన చేతుల మీదగా చేసే అవకాశాన్ని తనకు కల్పించారని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, మాజీ మేయర్‌ శిరీష, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement