‘ముగ్గురొచ్చి తంబిరెడ్డిని కిడ్నాప్‌ చేశారు’ | YSRCP Leader Mohit Reddy On Tambi Reddy Kidnap Episode | Sakshi
Sakshi News home page

‘ముగ్గురొచ్చి తంబిరెడ్డిని కిడ్నాప్‌ చేశారు’

Apr 3 2026 7:51 PM | Updated on Apr 4 2026 8:50 AM

YSRCP Leader Mohit Reddy On Tambi Reddy Kidnap Episode

తిరుపతి: తుమ్మలగుంట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంబిరెడ్డిని ముగ్గురొచ్చి కిడ్నాప్‌ చేశారని చంద్రగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు.  ‘31న రాత్రి ముగ్గురొచ్చి తంబిరెడ్డిని గుంటూరు తీసుకెళ్లారు. పోలీసులను అడిగితే తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో హైకోర్టులో కేసు వేశాం. నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇలా చేయడం దారుణం. .60 సంవత్సరాల వయస్సులో ఉన్న తంబిరెడ్డిని ఇలా కిడ్నాప్ చేయడం దారునం. మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు’ అని తెలిపారు

కారులో బలవంతంగా తీసుకెళ్లారు
‘నన్ను కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పలు పోలీస్‌ స్టేషన్లలో తిప్పారు. ఫేస్‌బుక్‌లో పోస్టుకు కామెంట్‌ పెట్టినందుకే అరెస్ట్‌ చేశారు. పోస్ట్‌ పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ప్రశనించారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement