ఇది చూసి నవ్వుకునేరు.. బాబోరు మళ్లీ వేసేశారు..! | CM Chandrababu on AP Bifurcation Justice | Sakshi
Sakshi News home page

ఇది చూసి నవ్వుకునేరు.. బాబోరు మళ్లీ వేసేశారు..!

Apr 3 2026 4:37 PM | Updated on Apr 3 2026 5:08 PM

CM Chandrababu on AP Bifurcation Justice

సాక్షి,అమరావతి: చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి పర్యాయ పదం. అయితే, ఆయన ధోరణి  రెండు నాల్కుల తీరు అనేది మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడు తాను విభజనకు వ్యతిరేకం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరిని మార్చుకునే చంద్రబాబు తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్‌ అని చెప్పడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.  

నిన్నగాక మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్ సిలిండర్‌తో వంట చేయొచ్చని చెప్పింది తానేన్నారు. గతంలో తన వల్లే అందరికీ సెల్‌ఫోన్లు వచ్చాయని కూడా చెప్పుకున్నారు. గతంలో ఇలాగే 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన పాత్ర ఉందని, ప్రధాని మోదీకి తానే సూచించానని ప్రచారం చేసుకున్నారు. అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని తానే ఆలోచించానని చెప్పి .. జనం  ముందు అభాసుపాలయ్యారు బాబోరు..ఈ విధంగా, తరచూ తనకే క్రెడిట్‌ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ, వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడటం ఆయనలోని విచిత్ర ధోరణిని బయటపెట్టుకుంటున్నారు.  

ప్రజలు ఏమనుకుంటారో అనేది సంబంధం లేకుండా ఏ ఘనతనైనా ఇట్టే తన ఖాతాలో వేసుసుకునే బాబుగారు.. తాజాగా తెలంగాణ నా బ్రెయిన్‌ చైల్డ్‌(నా మేధస్సు వల్లే పుట్టినది) అని చెప్పుకోవడం చూసి..బాబోరు మళ్లీ వేసేశారు అనుకుంటూ అదేదో సినిమాలోని సీరియస్‌ కమెడియన్‌ను గుర్తు చేసుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement