పట్టపగలే రెండిళ్లలో చోరీ
దొరవారిసత్రం: ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగలు పట్టపగలే రెండిళ్లలోకి చొరబడి రూ.2.65 లక్షలు నగదు, ఐదు సవర్ల బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన అయ్యపాళెంలో బుధవారం చోటు చేసుకోగా గురువారం వెలుగు చూసింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు... అయ్యపాళెం గ్రామానికి చెందిన చెవూరు శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో బుధవారం ఉదయం 10 గంటలకు వ్యవసాయ పనులకు వెళ్లిపోగా, మాయారి బాబు, భార్య గౌరి రోజూలాగానే తడలోని కంపెనీకి ఉదయమే విధి నిర్వహణకు వెళ్లిపోయారు. వీరి ఇద్దరు పిల్లలకు ఇంటికి తాళాలు వేసి పక్క గ్రామంలోని పాఠశాలకు వెళ్లారు. వ్యవసాయ పనులకు 11 గంటలకు ముగించుకుని శ్రీనివాసులు కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసికి ఇంటి తాళాలు పగుల గొట్టి బీరువాలో ఉన్న రూ.1.50 నగదు దోచుకువెళ్లినట్లు గుర్తించారు. అదే సమయంలో వీరి ఇంటి వెనుకనే ఉన్న మరో ఇంటి తాళాలు కూడా పగులగొట్టినట్లు గుర్తించి, పరిశీలించగా బీరువాలో ఉన్న రూ.1.15 లక్షల నగదు, ఐదు సవర్లు బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ అజయ్‌కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. గురువారం తిరుపతి నుంచి క్లూస్ టీమ్‌ను పిలిపించగా కొన్ని వేలిముద్రలను సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
విద్యార్థులకు సృజనాత్మకత అవసరం
నారాయణవనం: సృజనాత్మక పరిశోధనలతోనే ఇంజినీరింగ్ విద్యార్థులు గుర్తింపు పొందుతారని అనంతపురం జేఎన్‌టీయూ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్(అటానమస్) సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా గురువారం వ్యర్థాల(స్క్రాప్)తో సృజనాత్మకతను ప్రతిబింబించేలా తయారు చేసిన మోడళ్ల ప్రదర్శనను సిద్ధార్థ సంస్థల చైర్మన్ డాక్టర్ అశోక్ రాజు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్యనారాయణ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తాయని తెలిపారు. అశోక్‌రాజు మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలను సద్వినియోగం చేసుకుంటూ కొత్త ఆలోచనలతో మోడళ్లను రూపొందించడం విద్యార్థుల్లో సృజనాత్మకతను, పర్యావరణపై అవగాహనను పెంపొందిస్తుందన్నారు. నెల్‌కాస్ట్ వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఆలోచించే నైపుణ్యాలు విద్యార్థుల్లో పెరగాలంటే ఇన్నోవేటిట్ ఆలోచనలను ప్రోత్సహించాలన్నారు.
పట్టపగలే రెండిళ్లలో చోరీ


