లడ్డూకు మేకప్‌ ఘనత బాబుదే! | - | Sakshi
Sakshi News home page

లడ్డూకు మేకప్‌ ఘనత బాబుదే!

Feb 12 2026 7:04 AM | Updated on Feb 12 2026 7:04 AM

లడ్డూకు మేకప్‌ ఘనత బాబుదే!

లడ్డూకు మేకప్‌ ఘనత బాబుదే!

● టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి

కార్వేటినగరం/శ్రీరంగరాజపురం: రాజకీయంగా మాజీ సీఎం జగన్‌ను ఎదుర్కోలేక తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసినట్లు టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. శ్రీరంగరాజపురం మండలం, 49 కొత్తపల్లె మిట్ట లోని ఓ కల్యాణ మండపంలో బుధవారం వైఎ స్సార్‌సీపీ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్‌సీపీకి హిందువుల ఓట్లను దూరం చేయాలన్న దురాలోచనతో వ్యవహరిస్తోందన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో చంద్రబాబు లడ్డూ లో ఆవు కొవ్వు కలిసిందని మాట్లాడడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సనాతన ముసుగులో లడ్డూ ల్లో చేప నూనె, పంది, ఆవు కొవ్వు కలిసిందని ఒక డ్రామా ఆడడాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పారు.

బోలేబాబాకు బాబే అనుమతి

కుల రాజకీయీలకు ఆజ్యం పోసిన చంద్రబాబు ఇ ప్పుడు కొత్తగా మత రాజకీయాలకు తెరలేపినట్లు చెప్పారు. బోలే బాబాకు అనుమతిచ్చింది చంద్రబా బే కదా..? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ చేసిన సిట్‌ వైఎస్సార్‌సీపీ నేతలకు సంబంధం లేదని తేల్చినా మళ్లీ కుతంత్రాలకు ప్రయ త్నాలు చేయడం హాస్యాస్పదమన్నారు. టీటీడీ బోర్డు మెంబర్‌ సౌరబ్‌బోరా, మై హోమ్‌ అధినేత రామేశ్వర్‌ ఇద్దరి చేతితో చిలికిన 4,060 కిలోల నెయ్యిని తిరుమలకు సరఫరా చేసి, ఆ నెయ్యితోనే అయోధ్య రామ మందిరానికి లడ్డూలు తయారుచేసి పంపినట్టు తెలిపారు. అయితే ఆ నెయ్యిలో కల్తీ జరిగినట్లు పవన్‌కల్యాణ్‌ ఆరోపించారని చెప్పారు.

సువాసన కోసం..

28 ఫిబ్రవరి 2018లో చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీ పరాక్‌ ప్రోడక్ట్‌ నుంచి 87,500 కేజీల నెయ్యిని కేజీ రూ.300 చొప్పున కొనుగోలు చేసేందుకు టీటీడీ తీర్మానం చేసినట్లుఽ ఆధారాలు ఉ న్నాయన్నారు. అయితే లడ్డూ నాణ్యత లోపించడంతో సువాసన కోసం లడ్డూకు మేకప్‌ వేసినట్లు ఆరోపించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మా జీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఎలాగైనా హిందువులకు దూరం చేయాలన్న కుతంత్రంతోనే దేవాలయాల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవాల యాలను రాజకీయ వేదికగా మార్చుకుని అపచారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, నేతలు పాల్గొన్నారు.

మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement