ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
శ్రీకాళహస్తి : ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందుల్లేకుండా దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఉచిత దర్శనానికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ బలోపేతం, సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. ప్రతి శివరాత్రిని కొత్త శివరాత్రిలా భావించి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ సూచించారు. ఇతర రాష్ట్రాల్లోనూ బ్రహ్మోత్సవాలకు విశేష ప్రాచుర్యం ఉందని ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బాల్యవివాహాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తునికి స్వామి, అమ్మవార్ల పసుపు,కుంకుమ పాకెట్ క్యాలెండర్ పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేపడతామని ఆలయ ఈఓ బాపిరెడ్డి చెప్పారు.


