వీఆర్‌ఏపై దాడి కేసులో ఇద్దరి అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్: ఈ నెల 4వ తేదీన విధులు నిర్వహిస్తున్న ఓబనపల్లి వీఆర్‌ఏ మణెయ్యపై ఇద్దరు కారంపొడి చల్లి కత్తితో పొడిచి పారిపోయారు. ఈ కేసులో నిందితులను ఆదివారం సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యలో అనంతరాజుపేట వద్ద అరెస్ట్ చేశారు. వారి నుండి ఆయుధాలు, మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన నిందితులు అనరాతి శ్రీనివాసులు, కులశేఖర్ పాత కక్షలు మనసులో పెట్టుకొని మణెయ్యపై దాడి చేసినట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న మణెయ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు.


