రాగన రామాపురం వాసికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అ
సైదాపురం: సామాజిక సేవా కార్యక్రమాల్లో విశిష్ట సేవలందించినందుకు సైదాపురం మండలం రాగన రామాపురం గ్రామానికి చెందిన కూరాకు గోపికి స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని ఎీల్వీ ప్రసాద్ ల్యాబ్‌లో ఆదివారం సాయంత్రం విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రత్న హాజరయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్–19, హుద్ హుద్ తుపాన్ వంటి విపత్కర పరిస్థిలోనే కాకుండా గత 8 సంవత్సరాల నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రక్తదాన శిబిరాలు, చెట్లు, నాటడం, చలివేంద్రాలు తదితర సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందించారు. ఈ సందర్భంగా కురాకు గోపి తనని అవార్డుకు ఎంపిక చేసిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నెల్లూరు తిరుపతి జిల్లాలో కో–ఆర్డినేటర్ మోపూరు భాస్కర్ నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.


