రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి

Feb 13 2026 5:30 AM | Updated on Feb 13 2026 5:30 AM

రోడ్డ

రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి

రైల్వేకోడూరు అర్బన్‌: కడప–రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. గురువారం ఆయన రైల్వేకోడూరులో ఆకస్మికంగా పర్యటించారు. కడప–రేణిగుంట జాతీయ రహదారి విస్తరణ పనులు, రైతులు పండించే పంటలను పరిశీలించారు. అలాగే శెట్టిగుంట ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసి రోగులను సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి విస్తరణ పనుల పూర్తి చేసి, రవాణా సౌకర్యం మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. రైతులతో మాట్లాడుతూ వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకుని పంట సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంఆలలో ఆర్డీఓ రామ్మోహన్‌, తహసీల్దార్‌ అమర్‌నాథ్‌ పాల్గొన్నారు.

ఎస్వీయూలో నూతన కలెక్టర్‌ బంగ్లా

తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంబీఏ కళాశాల సమీపంలో కలెక్టర్‌ బంగ్లా కోసం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భవననిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయని త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నిర్మాణ పనులను ఇప్పటికే కలెక్టర్‌ సైతం పరిశీలించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం నిర్మిస్తున్న భవనం గత ప్రభుత్వ హయాంలో నగరపాలక సంస్థ మేయర్‌ బంగ్లా కోసం కేటాయించారు. కానీ నగరపాలక సంస్థ అధికారులు కలెక్టర్‌ బంగ్లా కోసం భవనాన్ని అప్పగించినట్లు తెలిసింది. వర్సిటీలో మళ్లీ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుల వ్యవహరం తెరపైకి రావడం, గత ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదననే ప్రస్తుతం అమలు చేయాలనే దిశగా నగరపాలక సంస్థ అడుగులు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు వర్సిటీ అధికారులతో చర్చించి మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల నిర్మాణ ప్రదేశాలను పరిశీలించారు.

రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి 1
1/1

రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement