పాస్‌పుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం | - | Sakshi
Sakshi News home page

పాస్‌పుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం

Feb 13 2026 5:30 AM | Updated on Feb 13 2026 5:30 AM

పాస్‌పుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం

పాస్‌పుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం

తిరుపతి అర్బన్‌: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 20 నెలలపాటు మౌనంగా ఉన్న చంద్రబాబు సర్కార్‌ ఎట్టకేలకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ ప్రక్రియ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఎన్ని పాస్‌ పుస్తకాలు కరెక్టగా ఉంటే అన్నింటిని పంపిణీ చేస్తే సరిపోతుంది. అయితే తప్పులు లేకుండా ఒక గ్రామంలో 70 శాతం పాస్‌పుస్తకాలు ఉంటే ఆ గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తున్నారు. మరోవైపు ఒక్కో మండలం నుంచి ఒక్కో నెలలో(ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ వరకు) 70 శాతానికి పైగా తప్పులు లేని ఒక్క గ్రామంలో పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఇలా చేస్తే శ్రీకాళహస్తి, ఏర్పేడు, ఆర్సీపురం, తొట్టంబేడు, వరదయ్యపాళెం తదితర పెద్ద మండలాల్లో 50 గ్రామాలకు పైగా ఉంటే 50 నెలలు పంపిణీ చేస్తే...రైతుల పరిస్థితులు ఏమిటో అర్థం కావడం లేదు. ముందే సర్వే పూర్తి అయిన గ్రామాల్లోని రైతులు పాస్‌పుస్తకాలు లేకపోవడంతో పంట రుణాలు తీసుకోవడానికి వీలులేకుండా ఇబ్బందులు పడుతున్నారు. 70శాతం పైన పాస్‌పుస్తకాలు తప్పులు లేకుండా ఉంటేనే ఆ గ్రామానికి ఇస్తామనే నిబంధనలు పక్కనపెట్టి ఏ గ్రామంలో ఎన్ని పాస్‌ పుస్తకాలు కరెక్ట్‌గా ఉంటే అన్నింటినీ రైతులకు ఇస్తామనే రూల్స్‌ను పాటించాలని పలువురు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉదాహణకు ఒక గ్రామంలో 600 మందికి పాస్‌ పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటే..అందులో 150 పాస్‌పుస్తకాలు తప్పులు లేకుండా ఉన్నా వాటిని పంపిణీ చేయడం లేదు. 70శాతం పైనా అంటే 420 పాస్‌పుస్తకాలు కరెక్టర్‌గా ఉంటే ఆ తర్వాత ఇస్తామని చెప్పడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒక గ్రామంలో ఎన్ని పాస్‌పుస్తకాలు కరెక్ట్‌గా ఉంటే వాటిని ఇవ్వడం...ఆ తర్వాత తప్పులను సవరిస్తున్న దశల వారీగా ఆయా గ్రామాల్లో ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement