నారాయణ కాలేజ్ తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
రేణిగుంట: మండలంలోని ఎల్లమండ్యం పంచాయతీలో ఉన్న నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థులను దారుణంగా కొట్టిన ఘటనపై విద్యార్థి సంఘాలు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చదువు పేరుతో విద్యార్థులను వేధిస్తూ, మానసిక ఒత్తిడికి గురిచేస్తూ, స్టడీ అవర్స్‌లో కొట్టారని బాధిత విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులకు తెలిపారు. దీనిపై స్పందించిన విద్యార్థి సంఘాల నేతలు ఈ చర్యలను నిరసిస్తూ ధర్నా చేశాయి. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఎస్వీయూ అధ్యక్షుడు మన్నం ప్రేమ్‌కుమార్, ఏఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు శివ బాలాజీ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్, రాయలసీమ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జ్యోతి ప్రకాష్, ఓబీసీ విద్యార్థి సంఘం రాయలసీమ అధ్యక్షుడు ఉత్తరాది విజయ్, విద్యార్థి నాయకులు దినేష్, సునీల్, హరి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బుచ్చినాయుడుకండ్రిగ:మద్యం మత్తు లో ద్విచక్రవాహనంపై వెళుతూ వరత్తూరు కాలువపై ఉన్న వంతెనకు ఓ వైపు దిమ్మెను ఢీ కొని వ్యక్తి మృతి చెందిన సంఘటన వెస్టువరత్తూర వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... వరదయ్యపాళెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రామ్మూర్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య మూడు నెలల గర్భిణి కావడంతో పుట్టిల్లు అయిన శ్రీకాళహస్తి మండలం కనపర్తి గ్రామంలో ఇద్దరు కుమార్తెలతో కలసి ఉంటుంది. రామ్మూర్తి కూలీ పనులు ముగించుకుని, భార్య వద్దకు వెళ్లడానికి బుధవా రం రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం సేవించి, ద్విచక్రవాహనంపై బయలు దేరాడు. మార్గం మధ్యలోని వెస్టువరత్తూరు గ్రామం వద్ద కాలువపై ఉన్న దిమ్మెను ఢీ కొన్నాడు. దీంతో రామ్మూరి తీవ్రగాయాలతో కాలువలోని నీటిలో పడి మునిగి చనిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయ గా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యా ప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.
నారాయణ కాలేజ్ తీరుపై విద్యార్థి సంఘాల ఆగ్రహం


