22 కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

22 కిలోల గంజాయి స్వాధీనం

Feb 8 2026 3:50 AM | Updated on Feb 8 2026 3:50 AM

22 కిలోల గంజాయి స్వాధీనం

22 కిలోల గంజాయి స్వాధీనం

– ముగ్గురి అరెస్టు

వెంకటగిరి రూరల్‌: ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. పట్టణంలోని వెంకటగిరి పోలీసుస్టేషన్‌లో శనివారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి పెనుబర్తి గణేష్‌తోపాటు మరో ఐదుగురు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు రహస్య సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టారు. వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను వెంకటగిరి సీఐ ఏవీ రమణ, ఎస్‌ఐ ఏడుకొండలు తనిఖీ చేశారు. వారి వద్ద 22 కిలోల గంజాయిని ఉన్నట్లు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకోవడానికి యత్నించగా ఇద్దరు యువకులు పరారయ్యారు. ఇద్ద రు మైనర్‌ బాలురతోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేశా రు. వారి వద్ద నుంచి 3 సెల్‌ఫోన్లు, 22 కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

గంజాయి విక్రేత అరెస్టు

తిరుపతి రూరల్‌: మండలంలోని ఉప్పరపల్లి సమీపంలో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథ నం మేరకు.. ఉప్పరపల్లి వాటర్‌ ట్యాంకు వద్ద శనివారం రహస్యంగా గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ వెంటనే తిరుపతి రూరల్‌ సీఐ చిన్నగోవిందు తమ సిబ్బందితో అక్కడ కు చేరుకుని గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చే శారు. అతని వద్ద నుంచి 3.5 కేజీల గంజాయితో పా టు ఓ ద్విచక్ర వాహనం, సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతనిని విచారించగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కె. దుర్యోధన్‌రెడ్డిగా గుర్తించిన పోలీసులు తిరుపతిలో ఓ ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement