10న వెటర్నరీ వర్సిటీలో కిసాన్ మేళా
చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన ఐసీఏఆర్, ఎన్‌ఎంఆర్‌ఐ సౌజన్యంతో కిసాన్ మేళాను నిర్వహించనున్నట్లు పశు వైద్యకళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కిసాన్ మేళాలో పశుసంవర్థక, వ్యవసాయ, ఉద్యానవన, అనుబంధ శాఖల వారీగా వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కిసాన్ మేళాలో రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, రుణ సదుపాయాలు తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
యూపీఎస్‌సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్: యూపీఎస్‌సీ ఇంజినీరింగ్ సర్వీసెస్(ప్రిలిమినరీ) పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని డీఆర్వో నరసింహులు, న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన అబ్జర్వర్ అజయ్‌జోషి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలోని రెండు సెంటర్లలో రెండు సెషన్స్‌ల్లో ఆదివారం పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఉదయం పేపర్–1 పరీక్ష 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం పేపర్–2 పరీక్ష 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. శ్రీపద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్(వింగ్–ఏ), శ్రీపద్మావతి ఉమెన్స్ జూనియర్ కాలేజ్(వింగ్–బీ) సెంటర్లలో 641 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లును లైజన్ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రానికి గుర్తింపు కార్డుతో వస్తేనే అనుమతి ఉంటుందని చెప్పారు. అలాగే విద్యుత్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
10న వెటర్నరీ వర్సిటీలో కిసాన్ మేళా


