అర్హత ఉన్నా ఫలితం శూన్యం
మాది పెనుమూరు మండలం చెరువ ముందర ఊరు. నా భర్త పేరు జ్యోతిశ్వర్‌నాయు డు. మాకు పార్థీవ్ చౌదరి అనే కుమారుడు ఉన్నాడు. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి శరీరం మొత్తం సహకరించడం లేదు. చికిత్స కోసం ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేదు. పింఛన్ పొందేందుకు 90 శాతం అర్హత ఉన్నట్లు సదరన్ సర్టిఫికెట్ కూడా ఉంది. అయినా కొత్త పింఛన్ ఇవ్వడం లేదు. మండలం, జిల్లా అధికారుల చుట్టూ బిడ్డను ఎత్తుకుని ఎన్ని సార్లూ తిరిగినా న్యాయం జరగడం లేదు. కనీసం కొత్త పింఛన్ ఎప్పుడిస్తారో కూడా ఎవరూ చెప్పడం లేదు.
– కుమారుడు పార్థీవ్ చౌదరితో తల్లి
ఎన్నిసార్లు తిరిగినా
లాభం లేదు
మాది తవణంపల్లి మండలం కృష్ణాపురం గ్రామం. పింఛన్ కోసం ఇప్పటికి వంద సార్లు అధికారులు అర్జీలు అందజేశాను. ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులూ పట్టించుకోవడం లేదు. మాకు ఇంకెవరు న్యాయం చేస్తారు. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ పొందలేని పరిస్థితిలో ఉన్నాను. కొత్త పింఛన్ ఎప్పుడిస్తారో కూడా ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. – దశరథ,
కొత్త పింఛన్ బాధితుడు
అర్హత ఉన్నా ఫలితం శూన్యం


