భక్తాగ్రేసరునికే అగ్ర తాంబూలం | - | Sakshi
Sakshi News home page

భక్తాగ్రేసరునికే అగ్ర తాంబూలం

Feb 11 2026 8:49 AM | Updated on Feb 11 2026 8:49 AM

భక్తా

భక్తాగ్రేసరునికే అగ్ర తాంబూలం

● ఆగమోక్తంగా కన్నప్ప ధ్వజారోహణం ● శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు మంగళవారం కన్నప్ప ధ్వజారోహణంతో ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. భక్తునికి కొండపై స్థానం కల్పించి, కింద కొలువైన పరమేశ్వరుడు తొలి పూజను భక్తునికే చెందేలా వరమిచ్చాడు. దీంతో శ్రీకాళహస్తిలో భక్తకన్నప్ప ధ్వజారోహణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అలంకార మండపంలో స్వామిఅమ్మవార్లు, భక్తకన్నప్ప ఉత్సవమూర్తికి పూజలు చేశారు. అనంతరం కన్నప్ప ఉత్సవమూర్తిని కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. కొండపై వెలసిన కన్నప్ప ఆలయం వద్ద ఉత్సవమూర్తిని కొలువుదీర్చి శాస్త్రోక్తంగా గణపతిపూజ, పుణ్యాహవచనం, మండప ఆరాధన, ధ్వజపూజ నిర్వహించారు. అనంతరం దర్బ, మామిడాకులతో కట్టిన దవళపతాకం, పూలహారాన్ని ధ్వజ స్థంభంపైకి ఎగురవేశారు. తరువాత శివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. బో యలు అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈ సందర్భంగా వస్త్రం, నైవేద్యం సమర్పించారు. ఆ తరువాత గ్రామోత్సవం ప్రారంభంమైంది. రాజగోపురం నుంచి చతుర్మాడవీధీల్లో కన్నప్ప గ్రామోత్సవం వైభవంగా జరిగింది.

ధ్వజస్తంభానికి అభిషేకం చేస్తున్న వేదపండితులు

తిరుపతి గ్రేటర్‌ కావాల్సిందే.. అందుకు మున్సిపల్‌ తీర్మానాన్ని సర్కారు ఆమోదించి తీరాల్సిందే.. వచ్చే ఎన్నికలు గ్రేటర్‌ తిరుపతిగానే జరుగుతాయని ఆశిస్తున్నాం.. మహానగర ప్రతిపాదనతోనే తిరుపతికి అరుదైన గౌరవం అని నగర కార్పొరేషన్‌ మేయర్‌ శిరీష, కార్పొరేటర్లు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ తీర్మానాన్ని అమోదించారు. దీన్ని చంద్రబాబు సర్కారు ఆమోదించాలని వారు డిమాండ్‌ చేశారు.

కౌన్సిల్‌ నిర్వహిస్తున్న మేయర్‌ డాక్టర్‌ శిరీష

గ్రేటర్‌ తిరుపతి..

శాస్త్రోక్తంగా వాస్తు శాంతిపూజలు

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం రాత్రి వాస్తు శాంతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామోత్సవం ముగిసిన తరువాత ఆలయంలో వేదపండితులు గణపతి హోమం, పూజ చేశారు. అలాగే ఆలయానికి వాస్తు శాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, పాలకమండలి చైర్మన్‌కొట్టే సాయిప రసాద ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు బీజేపీ నాయకులు కోలా ఆనంద్‌ పాల్గొన్నారు.

భక్తాగ్రేసరునికే అగ్ర తాంబూలం1
1/2

భక్తాగ్రేసరునికే అగ్ర తాంబూలం

భక్తాగ్రేసరునికే అగ్ర తాంబూలం2
2/2

భక్తాగ్రేసరునికే అగ్ర తాంబూలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement